India vs Zimbabwe 2nd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, జింబాబ్వే జట్ల మధ్య రెండో వన్డే ఆరంభం కానుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్న ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి మరోసారి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. దీపక్ చహర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు జింబాబ్వే రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
జింబాబ్వే గడ్డపై అలవోక విజయంతో శుభారంభం చేసిన భారత్.. ఇప్పుడు అదే జోరుతో సిరీస్‌పై కన్నేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే కప్ గెలవాలనే పట్టుదలతో కేఎల్ రాహుల్ సేన బరిలోకి దిగుతోంది. మొదటి వన్డేలో ఓడిన ఆతిథ్య జింబాబ్వే.. ఈ మ్యాచులో గెలవక పోయినా టీమిండియాకు కనీస పోటీ ఇవ్వాలని చూస్తోంది. బంగ్లాదేశ్‌తో భారీ స్కోర్లను ఛేదించి మరీ గెలిచిన ఆతిథ్య జింబాబ్వే జట్టు ఈ మ్యాచులో ఎలా ఆడుతుందో చూడాలి.
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12:45 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ భారతదేశంలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు సోనీలివ్ వెబ్‌సైట్ మరియు యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వికెట్ ఇన్నింగ్స్ ఆరంభంలో బౌలర్లకు సహకరించనుంది. మ్యాచుకు ఎలాంటి వర్ష సూచన లేదు.
తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, సంజూ శాంసన్ (కీపర్), అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, మొహ్మద్ సిరాజ్.
జింబాబ్వే: రెగిస్ చకాబ్వా (కెప్టెన్), ఇన్నోసెంట్ కైయా, టకుడ్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, సీన్ విలియమ్స్, సికందర్ రజా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యౌచి, తనకా చివాంగా.
Also Read: నైట్ వేర్‌లో క్లివేజ్ అందాలు.. సెగలు పెట్టిస్తున్న డింపుల్ హయాతి!
Also Read: బీఎస్ఎన్ఎల్ సూపర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్.. 75 రోజులకు రూ. 275 మాత్రమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook