PV Sindhu-Prabhas: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. హీరోయిన్‌గా చేస్తా: పీవీ సింధు

PV Sindhu Reveals Fav Telugu Hero Prabhas. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ అంటే చాలా ఇష్టమని, తాము ఇద్దరం మంచి స్నేహితులం కూడా అని తెలుగు తేజం పీవీ సింధు చెప్పారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 20, 2022, 05:58 PM IST
  • ఆ హీరో అంటే చాలా ఇష్టం
  • హీరోయిన్‌గా చేస్తా
  • పీవీ సింధు ఆసక్తికర విశేషాలు
PV Sindhu-Prabhas: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. హీరోయిన్‌గా చేస్తా: పీవీ సింధు

PV Sindhu Reveals Fav Telugu Hero Prabhas: పీవీ సింధు.. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరు. ఎందుకంటే.. తెలుగు తేజం పీవీ సింధు అంతర్జాతీయ వేదికలపై భారత జెండాను రెపరెపలాడించారు. బ్యాడ్మింటన్‌లో దేశానికి ఎన్నో మెడల్స్ సాధించి విశేష గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. ఒలింపిక్, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మెడల్స్ కూడా కైవసం చేసుకున్నారు. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సింధు పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. 

విదేశాల్లో మెడల్ తీసుకునే సమయమయంలో జాతీయ గీతం వినిపించినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని పీవీ సింధుని హోస్ట్ అడగ్గా... 'విదేశాల్లో మన జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు మాకు కన్నీళ్లు వస్తాయి. భారతదేశ పతాకం, జాతీయ గీతం విదేశాల్లోనూ  వినిపించినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. అదే సమయంలో చాలా ఆనందంగా ఉంటుంది' అని సింధు అన్నారు. 

తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం అని అడగ్గా... 'చాలా మంది హీరోలు ఉన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ అంటే చాలా ఇష్టం. మేము మంచి స్నేహితులం కూడా' అని తెలుగు తేజం పీవీ సింధు చెప్పారు. సింధు సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని హోస్ట్ అడగ్గా.. 'ఏమో నా బయోపిక్ ఉండొచ్చేమో. అందులో నేనే హీరోయిన్‌గా చేస్తానేమో' అని నవ్వుతూ బదులిచ్చారు. లవ్ లెటర్స్ గురించి అడగ్గా.. తనకు ఇప్పటివరకు ఎన్నో ప్రేమ లేఖలు వచ్చాయని, అందులో ఓ 70 ఏళ్ల వ్యక్తి రాసిన లెటర్ కూడా ఉందని సింధు చెప్పారు. తనను పెళ్లి చేసుకోకపోతే కిడ్నాప్‌ చేస్తానని కూడా రాశాడని చెప్పుకొచ్చారు. 

Also Read: బుసలు కొడుతోన్న అతిపెద్ద కింగ్‌ కోబ్రాకు ఎలా కళ్లెం వేశాడో చూడండి.. నీ గుండె ధైర్యానికి ఓ హ్యాట్సాఫ్!

Also Read: ఐడీ కార్డుపై బికినీ ఫోటో.. షాకైన టెన్నిస్‌ ప్లేయర్ బౌచర్డ్‌! ఈ ఫొటోనే ఎందుకు అంటూ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News