IND vs ZIM: అంతర్జాతీయ క్రికెట్లో భారత్ దూసుకెళ్తోంది. వరుసగా సిరీస్‌లను తన ఖాతాలో వేసుకుంటోంది. తాజాగా జింబాబ్వే గడ్డపై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. రేపు(సోమవారం) నామమాత్రపు మ్యాచ్ జరుగుతుంది. హరారే వేదికగా రేపు మధ్యాహ్నం 12.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ను ఆపడం జింబాబ్వేకు సాధ్యం కాకపోవచ్చు. అన్ని విభాగాల్లో టీమిండియా ప్రతిష్ఠంగా ఉంది.
ఇప్పటికే వన్డే సిరీస్ సొంతం కావడంతో చివరి మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈసిరీస్‌లో ఇప్పటివరకు ఆడని వారికి చోటు కల్పించనున్నారు. చివరి వన్డేలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆసియా కప్ త్వరలో ప్రారంభంకానుంది. ఈమ్యాచ్ ద్వారా టచ్‌లోకి రావాలని అతడు భావిస్తున్నాడు. జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక అయిన షాబాద్ అహ్మద్ రేపు ఆడనున్నట్లు తెలుస్తోంది.
ఆవేష్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, దీపక్ చాహర్‌కు అవకాశం కల్పించనున్నారు. ధావన్‌కు విశ్రాంతిని ఇచ్చి శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌ను ఆడించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఆల్‌రౌండర్ కోటాలో అక్షర్‌పటేల్, షాబాజ్ అహ్మద్ తుది జట్టులో ఉండనున్నారు. చివరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని జింబాబ్వే యోచిస్తోంది. తొలి వన్డేలో చిత్తుగా ఓడినా..రెండో వన్డేలో కాస్త పోరాడింది.
అదే స్ఫూర్తితో మూడో వన్డేలో దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నారు. జింబాబ్వే జట్టులో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం కల్పించడం లేదు. ఐతే బెంచ్‌కు పరిమితమైన ఆటగాళ్లను ఆడించాలని యాజమాన్యం భావిస్తోంది. అదే జరిగితే కొత్త సభ్యులతో జింబాబ్వే బరిలో నిలవనుంది. రెండో వన్డేలో ఆ జట్టు బౌలర్లు ఆకట్టుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదుగురు భారత ఆటగాళ్లను తక్కువ స్కోర్‌కే ఔట్ చేశారు. మూడో వన్డేలో బౌలింగ్‌తో టీమిండియా దెబ్బతీయాలని జింబాబ్వే యోచిస్తోంది.
భారత జట్టు(అంచనా)..
కేఎల్ రాహుల్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, అక్షర్‌పటేల్, షాబాద్ అహ్మద్, ఆవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్..
జింబాబ్బే జట్టు(అంచనా)..
కియా, కైటానో, మధెవెర, విలియమ్స్, రజా, ఛకబ్వా(కీపర్, కెప్టెన్), బుర్ల్, జాన్వే, ఈవెన్స్, న్యౌచి, తనకా చివంగా
Also read:Crime News: పెద్దపల్లి జిల్లాలో భర్తను చంపించిన భార్య..పోలీసుల దగ్గర కీలక విషయాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి