Astrology Tips: నవగ్రహ దోషాల నుండి విముక్తి పొందాలంటే.. ఈ చెట్ల వేర్లను ధరించండి!

Astrology Tips: గ్రహాల అశుభ ప్రభావం మనిషి జీవితంలోని కష్టాలకు కారణం. ఈ గ్రహ దోషాలను వదిలించుకోవడానికి జ్యోతిషశాస్త్రంలో అనేక పరిహారాలు చెప్పబడ్డాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2022, 06:52 PM IST
Astrology Tips: నవగ్రహ దోషాల నుండి విముక్తి పొందాలంటే.. ఈ చెట్ల వేర్లను ధరించండి!

Astrology Tips: ఆస్ట్రాలజీలో నవగ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ వ్యక్తి జాతకంలో ఈ గ్రహాలు శుభస్థానంలో ఉంటాయో వారి జీవితం బిందాస్ గా ఉంటుంది. ఎవరి కుండలిలో అయితే ఈ గ్రహాలు బలహీన స్థితిలో లేదా అశుభ స్థానంలో ఉంటాయో వారి జీవితం శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతోంది. ఆస్ట్రాలజీలో (Astrology) ఈ గ్రహాల చెడు ప్రభావాలను తగ్గించడానికి కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. ఈ నివారణలలో ఒకటి చెట్ల వేర్లు తీసుకోవడం.  

నవగ్రహ శాంతి కోసం ఈ చెట్ల వేర్లు ధరించండి
సూర్య గ్రహం శాంతికి- ఒక వ్యక్తి యొక్క జాతకంలో సూర్యుడు అశుభ ఫలితాలను ఇస్తే... ఆదివారం నాడు గులాబీ రంగు దారంతో బిల్వపత్రం యొక్క వేరును కట్టి ధరించడం వల్ల విశేష ప్రయోజనం లభిస్తుంది.
చంద్రగ్రహ శాంతికి- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహం వల్ల కలిగే అశుభాలు తొలగిపోవాలంటే ఖిర్ణి వేరును తెల్లటి గుడ్డలో తెల్లటి దారంతో కట్టి ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
కుజుడు శాంతి కోసం- కుజుడును శక్తి, ధైర్యానికి కారకుడిగా భావిస్తారు. మీ జాతకంలో అంగారకుడు బలపడాలంటే...ఎర్రటి వస్త్రంలో ఖేర్ వేరును ఎర్రటి దారంతో కట్టి ధరించండి. 
బుధ గ్రహం శాంతి కోసం- విధార వేరును పచ్చటి వస్త్రంలో కట్టి ధరించడం వల్ల బుధ గ్రహం యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. దీనిని బుధవారం మాత్రమే ధరించండి.

బృహస్పతి శాంతి కోసం- జాతకంలో కుజుడు అశుభ స్థానంలో ఉంటే గురువారం నాడు అరటి చెట్టు వేరును పసుపు గుడ్డలో ఉంచి పసుపు దారంతో కట్టండి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
శుక్రుడు శాంతి కోసం- శుక్రగ్రహం యొక్క శుభప్రభావాల కోసం, తెల్లటి వస్త్రంలో తెల్లటి దారంతో తాంబూల చెట్టు వేరును కట్టి శుక్రవారం నాడు ధరించండి.
శని గ్రహం శాంతి కోసం - శమీ వృక్షం శని దేవుడికి చాలా ప్రీతికరమైనది. కావున శమీ చెట్టు వేరును నీలిరంగు వస్త్రంలో నీలిరంగు దారంతో కట్టి శనివారం నాడు ధరించడం వల్ల మేలు జరుగుతుంది.
రాహు గ్రహం శాంతికి- రాహు గ్రహాన్ని ఛాయా గ్రహంగా భావిస్తారు. దాని దుష్ఫలితాలు తొలగిపోవాలంటే తెల్లటి చందనం ముక్కను నీలిరంగు గుడ్డలో ఉంచి నీలిరంగు దారంతో కట్టాలి.
కేతు గ్రహం శాంతికి- కేతువును కూడా ఛాయా గ్రహంగా కూడా పరిగణిస్తారు. జాతకంలో కేతువు బలపడాలంటే గురువారం నాడు అశ్వగంధ వేరును నీలిరంగు వస్త్రంలో నీలిరంగు దారంతో కట్టి ధరిస్తే శ్రేయస్కరం.

Also Read: Mercury Transit 2022: కన్యా రాశిలోకి బుధ గ్రహం.. ఈ నాలుగు రాశుల వారికి లక్కీ టైమ్ స్టార్ట్ అయినట్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x