Heart Attack In Women: స్త్రీలలో పెరుగుతున్న గుండె పోటు సమస్యలు.. సోనాలి ఫోగట్‌కు గుండె పోటు రావడానికి కారణాలు ఇవే..

Heart Attack Symptoms In Women: సోనాలి ఫోగట్ మృతితో బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది. ఆమె బిగ్ బాస్ సీజన్ 14 లో మంచి కంటెస్టెంట్‌గా పేరు సంపాదించుకున్నారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్రవేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 24, 2022, 03:07 PM IST
  • స్త్రీలలో పెరుగుతున్న గుండె సమస్యలు
  • ఈ కారణాల వల్లే స్త్రీలకు గుండెపోటు వస్తుంది
  • స్త్రీలలో గుండెపోటు లక్షణాలు ఇవే..
Heart Attack In Women: స్త్రీలలో పెరుగుతున్న గుండె పోటు సమస్యలు.. సోనాలి ఫోగట్‌కు గుండె పోటు రావడానికి కారణాలు ఇవే..

Heart Attack Symptoms In Women: సోనాలి ఫోగట్ మృతితో బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది. ఆమె బిగ్ బాస్ సీజన్ 14 లో మంచి కంటెస్టెంట్‌గా పేరు సంపాదించుకున్నారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్రవేశారు. హర్యానా చెందిన ఆమె.. బీజేపీ నాయకురాలుగా ప్రజలకు చాలా సేవలు కూడా చేశారు. సోనాలి 42 ఏళ్ల వయసులోనే గుండె పోటుతో మరణించడం ఆమె ఫ్యాన్స్‌కు తీరని లోటు మిగిల్చింది. అయితే సోనాలి చనిపోయే ముందు.. ఆమెకు ముందుగా  ఛాతీ నొప్పి వచ్చింది. ఆ తర్వాత తీవ్ర గుండె నొప్పితో మరణించారు. ప్రస్తుతం మారుతున్న జీవన శైలికారణంగా గుండెపోటు సమస్యలు పెరిగి  మరణాలు వేగంగా పెరుగుతున్నాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ కారణాల వల్లే స్త్రీలకు గుండెపోటు వస్తుంది..!:
ప్రస్తుతం చాలా మంది..అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటున్నారు. దీని వల్ల రోజంతా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. దీంతో చిన్న వయసుల్లోనే మధుమేహం, థైరాయిడ్, డిప్రెషన్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. దీంతో మహిళలు కూడా గుండెపోటుకు గురవుతున్నారు.

వీరికే ఎక్కువ ప్రమాదం:
మహిళలు ప్రస్తుతం చాలా బీజీగా ఉంటున్నారు. దీని కారణంగా యోగా, జిమ్, సైక్లింగ్, వ్యాయామాలు చేయలేకపోతున్నారు. దీంతో వీరు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.  65 ఏళ్లకు మందే మహిళల్లో గుండెపోటు సమస్యలు ఏర్పడుతున్నాయి.

గుండెపోటు లక్షణాలు:
>>శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
>>రెండు చేతులలో తీవ్రమైన నొప్పి.
>>చెమటలు పట్టడం.
>>ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, అలసిపోయినట్లు అనిపించడం.
>>మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
>>ఉదయం లేవగానే కళ్లు తిరగడం.
>>మెడ నుంచి పొత్తికడుపు వరకు ఇబ్బంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News