Planet Changes 2022: సెప్టెంబర్ లో ఏయే గ్రహాలు రాశిని మార్చనున్నాయో తెలుసా?

Planet Transits 2022: వచ్చే నెలలో కొన్ని ప్రధాన గ్రహాలు తమ రాశిని మార్చనున్నాయి. వీటి ప్రభావం మెుత్తం 12 రాశుల ప్రజలపై ఉంటుంది. ఏయే రాశులు తమ స్థానాన్ని మార్చనున్నాయో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2022, 02:18 PM IST
Planet Changes 2022: సెప్టెంబర్ లో ఏయే గ్రహాలు రాశిని మార్చనున్నాయో తెలుసా?

Grah Gochar in September 2022: మరో నాలుగు రోజుల్లో సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. ఈ మాసంలో 2 గ్రహాలు రాశిని మారుస్తుంటే... మరో రెండు గ్రహాలు స్థానాన్ని చేంజ్ చేస్తున్నాయి. ఈ గ్రహాల మార్పు ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. సెప్టెంబరు నెలలో ఏ గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయో తెలుసుకుందాం. 

కన్యారాశిలో బుధుడు తిరోగమనం (సెప్టెంబర్ 10, 2022): బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలో రెండు సార్లు తిరోగమనం చెందనున్నాడు. 10 సెప్టెంబర్ 2022, శనివారం ఉదయం 8:42 గంటలకు తిరోగమనం చెందుతాడు. ఆ తర్వాత అక్టోబర్ 2వ తేదీ ఆదివారం ఉదయం 8:42 గంటలకు మరోసారి తిరోగమనం చెందుతాడు.  

శుక్రుడు సింహరాశిలో అస్తమిస్తాడు (సెప్టెంబర్ 15, 2022): శుక్రుడు సెప్టెంబర్ 15, 2022 తెల్లవారుజామున 02:29 గంటలకు సింహరాశిలో అస్తమిస్తాడు మరియు డిసెంబర్ 2 ఉదయం 6.13 వరకు అదే స్థితిలో ఉంటాడు.

కన్యారాశిలో సూర్యుని సంచారం (17 సెప్టెంబర్ 2022): 17 సెప్టెంబర్ 2022 శనివారం, సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశి నుండి బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహం అక్టోబర్ 17 వరకు అక్కడే ఉంటుంది.

కన్యారాశిలో శుక్రుని సంచారం (24 సెప్టెంబర్ 2022): 24 సెప్టెంబర్ 2022 శనివారం రాత్రి 8:51 గంటలకు, శుక్ర గ్రహం సింహరాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశిస్తుంది.  ఇది అక్టోబర్ 18 వరకు అక్కడే ఉంటుంది.

Also Read: కన్యారాశిలో బుధుడు తిరోగమనం...అక్టోబర్ 26 వరకు ఈ రాశులకు డబ్బే డబ్బు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News