Vinayaka Chavithi 2022: భాద్రపద మాసం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తుకొచ్చేది ఈ నాయక చవితి. వినాయక చవితి ఉత్సవాలు దాదాపు తొమ్మిది నుంచి పది రోజులు భారతీయులు జరుపుకుంటారు. భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథిలో వినాయకుడి జన్మించినందుకు గాను ఈ నవరాత్రులు జరుపుకుంటారు. ఈ నవరాత్రులు భక్తులంతా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని కొలుస్తారు. అంతేకాకుండా ముఖ్యమైన వినాయకుని గుడిలలో పూజలు, అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తారు. ఈ ఉత్సవాలను జరిపే రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్యప్రదేశ్, గోవా, కేరళ ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక్కడ చవితి రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ నవరాత్రులలో భారత్ లో ఉన్న వాళ్ళు ముఖ్యమైన గణేశుని దేవాలయాలు తప్పకుండా సందర్శిస్తే మంచి ఫలితాలు పొందుతారని శాస్త్రం తెలుపుతోంది. అయితే ఆ దేవాలయాల్లో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆది వినాయక దేవాలయం, తమిళనాడు:
ఆది వినాయకుడనేది వినాయకుని లో ఒక రూపం.. అయితే ఈ దేవాలయాన్ని సందర్శించి వినాయకుడికి పూజలు చేస్తే మంచి ఫలితాలు సిరిసంపదలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. వినాయక చవితి రోజున ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు కూడా నిర్వహిస్తారు. పూజా కార్యక్రమంలో పాల్గొంటే ఎలాంటి నిర్విఘ్నాలు కూడా ఉన్న తొలగిపోతాయని నమ్మకం.
సిద్ధి వినాయక దేవాలయం, ముంబై:
సిద్ధి వినాయక దేవాలయం భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత గలది. అంతేకాకుండా ఇది పురాతనమైన దేవాలయం కూడా.. ఇక్కడికి నిత్యం భక్తులు పెద్ద ఎత్తున సందర్శించి గణనాథునికి పూజా కార్యక్రమాలు చేస్తారు. అయితే ఈ దేవాలయంలో స్వామివారికి ఇష్టమైన పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి నమ్మకం.
శ్రీ దొడ్డి గణపతి దేవాలయం, బెంగుళూరు:
ఈ దేవాలయానికి కూడా మంచి గుర్తింపు ఉంది. ప్రాచీనమైన గణపతి దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి. ఇందులో స్వామి వారు దొడ్డి గణపతి రూపంలో దర్శనం ఇస్తారు. దేవాలయంలో స్వామి వారు 14 అంగుళాల వెడల్పుతో 18 అడుగుల ఎత్తున విగ్రహంతో భక్తులకు కనిపిస్తారు. దేవాలయాల్లో అత్యంత ఎత్తైన వినాయక విగ్రహాల్లో ఈ దొడ్డి గణపతి విగ్రహం ఒకటి. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే మనసులో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్ముతారు.
వరసిద్ధి వినాయక దేవాలయం, ఉమ్మడి చిత్తూరు:
కాణిపాకం లో సిద్ధి వినాయకుడు సజీవ మూర్తిగా వెలిశారు. ఇక్కడ స్వామివారికి కొన్ని లక్షల వేల సంవత్సరాల నాటి చరిత్ర కలిగి ఉంది. ఇక్కడ కొలువుదీరిన గణేశుని దర్శించుకుంటే భవిష్యత్తులో ఏర్పడే నిర్విఘ్నాలైన తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కాబట్టి చవి రోజున ఈ దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి.
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు.
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook