TS Intermediate Supplementary Results 2022 Released: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ప్రకటించింది. నేటి (ఆగస్టు 30) ఉదయం 9.30 గంటలకు ఫలితాలు వెలువడ్డాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ రీత్యా ఇంటర్ సెకండియర్ ఫలితాలు మాత్రమే ఇవాళ విడుదల చేశారు. ఫలితాలు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in.లో అందుబాటులో ఉంచారు.
రిజల్ట్స్ ఈ వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోండి
tsbie.cgg.gov.in
results.cgg.gov.in
manabadi.co.in
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
మొదట https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో 'ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు' ఆప్షన్‌పై క్లిక్ చేయండి
స్క్రీన్‌పై కనిపించే బాక్స్‌లో మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి
అంతే.. స్క్రీన్‌పై మీ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి
ఫలితాల కాపీని ప్రింటవుట్ తీసి ఉంచుకోండి
ఈ ఏడాది మే 6-మే 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. ఈసారి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో 4,64,626 మంది ఫస్టియర్ విద్యార్థులు, 4,42,767 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. ఫస్టియర్‌లో 2,94,378 మంది ఉత్తీర్ణులు కాగా సెకండియర్‌లో 2,95,949 మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలు నిర్వహించిన 33 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించారు.
ఇక సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుంచి నిర్వహించారు. ప్రస్తుతం ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నందునా ఫలితాలు ఎప్పుడొస్తాయోనని సప్లిమెంటరీ పరీక్షలు రాసిన సెకండియర్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
Also Read: Gorantla Madhav: గోరంట్ల మాధవ్ చూట్టూ ఉచ్చు బిగిస్తోందా..స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook