K.Laxman: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఏపీలో మాత్రం జనసేనతో కలిసి ముందుకు వెళ్తామన్నారు. ఎన్డీఏలోకి టీడీపీ చేరుతుందన్న ప్రచారంపై ఆయన స్పందించారు. అది కేవలం ప్రచారమేనని తేల్చి చెప్పారు. అలాంటి పొత్తు ఉండే ముందే చెబుతామని చెప్పారు. ఏపీలో సీఎం జగన్ పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకుంటామన్నారు.
కర్ణాటకలోనూ మళ్లీ అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో ఇద్దరు సీఎంలు కేసీఆర్, నితిష్‌కుమార్ భేటీ పచ్చి అవకాశవాదుల సమావేశమని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు ఇంట గెలవడం చేతకాక బయటకు వెళ్లి రచ్చ చేస్తున్నారని విమర్శించారు. ఆయన తీరు చూస్తుంటే మజ్లిస్‌తో కాకుండా కాంగ్రెస్‌తో వెళ్లే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ పార్టీలన్నీ..ఒకే తరహా విధానాలతో ముందుకు వెళ్తున్నాయని విమర్శించారు. గల్వాన్ అమరవీరులు, సికింద్రాబాద్ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు సహాయం చేయడంలో తప్పులేదని.కానీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు తీరిక లేదా అని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను, కొండగట్టు మృతుల కుటుంబాలను ఇంత వరకు ఎందుకు ఆదుకోలేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 26 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారని గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతోందని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమ పార్టీయే విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ చేదు అనుభవం తప్పదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీదే విజయమన్నారు బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్. తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయమని తెలిపారు. ఈవిషయాన్ని సీఎం కేసీఆర్ సహించలేకపోతున్నారని..అందుకే నీచ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. త్వరలో మునుగోడులో మరో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.
Also read:SKY Batting Secret: బహుశా నా బ్యాటింగ్ సీక్రెట్ అదేనేమో.. స్నేహితులతో కలిసి..!
Also read:Dawood Ibrahim: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ఎన్ఐఏ రివార్డు... ఆచూకీ చెబితే రూ.25 లక్షలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి