Kabul: కాబుల్‌లో ఆత్మాహుతి దాడి..20 మంది మృతి..పలువురికి గాయాలు..!

Kabul: కాబుల్‌లో బాంబుల మోత మోగింది. రష్యా దౌత్య కార్యాలయమే టార్గెట్‌ దాడి కొనసాగింది. ఇందులో పదుల సంఖ్యలో మృతులు ఉన్నట్లు తెలుస్తోంది.

Written by - Alla Swamy | Last Updated : Sep 5, 2022, 05:17 PM IST
  • కాబుల్‌లో బాంబుల మోత
  • రష్యా దౌత్య కార్యాలయమే టార్గెట్‌ దాడి
  • పదుల సంఖ్యలో మృతులు
Kabul: కాబుల్‌లో ఆత్మాహుతి దాడి..20 మంది మృతి..పలువురికి గాయాలు..!

Kabul: అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో బాంబు దాడి జరిగింది. రష్యా దౌత్య కార్యాలయంపై జరిగిన దాడిలో ఇద్దరు దౌత్యవేత్తలు సహా 20 మంది దుర్మరణం చెందారు. దౌత్యవేత్తల మరణాన్ని రష్యా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. కాబుల్‌లోని దౌత్య కార్యాలయం బయట ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. దారుల్‌మాన్ రోడ్డులోని కార్యాలయం వద్ద వీసాలకు దరఖాస్తులు చేసుకునేందుకు జనాలు భారీగా తరలించారు. ఈక్రమంలో వారి పేర్లను పిలిచేందుకు దౌత్యవేత్త బయటకు వచ్చిన సమయంలో పేలుడు జరిగింది. 

ఓ వ్యక్తి బాంబును శరీరానికి ధరించి ఆత్మహుతి దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనలో ఇద్దరు దౌత్య సిబ్బంది మృతి చెందారు. మరో దౌత్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డు గాయపడినట్లు అధికారులు తెలిపారు. అఫ్ఘానిస్థాన్‌లో దౌత్య కార్యాలయాన్ని రష్యా నిర్వహిస్తోంది. దీనిపై తాలిబన్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడికి బాధ్యత వహిస్తూ ఏ సంస్థ ముందుకు రాలేదు. అఫ్ఘానిస్థాన్‌ గడ్డపై అమెరికా సైన్యాలు వెళ్లిపోయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఈక్రమంలోనే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ దాడులు చేస్తోంది. ఇలాంటి కార్యాకలాపాల్లో తాలిబన్లే అధికంగా ఉన్నారు. 

Also read:Jharkhand: విశ్వాస పరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సీఎం సోరెన్..ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు..!

Also read:Asia Cup 2022: కోహ్లీ ఎప్పటికీ రన్‌ మిషనే..విరాట్‌పై భారత మాజీ స్టార్ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News