Birds Nest in House: ఉదయం, సాయంత్రం వేళల్లో పక్షులకు ఆహారం వేస్తుంటాం..దీనిని అందరూ ఆస్వాదిస్తుంటారు. పక్షులు బయటి ప్రాంతం కనిపిస్తే బాగానే ఉంటుంది. ఐతే ఇంటి సమీపంలో కనిపించడం మనకు చిరాకు తెప్పిస్తుంది. వాటి అరుపులు, కేకలు వినిపిస్తుంటాయి. దీంతో చాలా మంది పక్షుల గూళ్లను తొలగిస్తుంటారు. ఇలా ఉంటే ఇంటికి అరిష్టమని నమ్ముతుంటారు. ఐతే నిజామా..లేక అసత్య ప్రచారామా అన్న దానిపై మైపాండిట్ సీఈవో కల్పేష్ షా..వాస్తు శాస్త్రానికి అనుగుణంగా క్లారిటీ ఇచ్చారు.
ఇంట్లో పక్షుల గూడు ఉంటే మంచిదంటున్నారు. వాస్తు శాస్త్ర ప్రకారం పక్షి..గూడును తయారు చేయడం అనేది పవిత్రమైనది భావిస్తారు. అందుకే ఏ గూడును నాశనం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. పక్షుల రాక జీవితంలో మెరుగుదలను కనిపిస్తుందని స్పష్టం చేస్తున్నారు. పక్షుల గూళ్లతో 10 రకాలైన వాస్తు లోపాలు తుడుచుపెట్టుకుపోతాయని అంటున్నారు. సనాతన ధర్మంలో దేవతలందరికీ పక్షులు వాహనాలుగా ఉన్నాయి.
కార్తీకేయుడికి నెమలి, సరస్వతి దేవికి హంస, విష్ణువుకు గరుడ, శని దేవుడికి కాకి, లక్ష్మీ దేవికి గుడ్లగూబ, వినాయకుడికి ఎలుక వాహనాలు ఉన్నాయి. పక్షులను పూజిస్తే దేవుళ్లను పూజించినట్లు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇళ్లలో పక్షులు గూళ్లను ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటికి మంచిదంటున్నారు. మత విశ్వాసాలకు అనుగుణంగా పావురాలు లక్ష్మీదేవిని ఆరాధించేవిగా చెబుతుంటారు. పావురాలు ఇంటికి వస్తే లక్ష్మీదేవి వచ్చినట్లేనని అంటున్నారు.
అందుకే ఇళ్లల్లో పక్షుల గూళ్లను తొలగించవద్దని వాస్తు శాస్త్రం స్పష్టం చేస్తోంది. పక్షులకు ఇంకా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంచితే మరి మంచిదంటున్నారు. ప్రతి రోజూ పక్షులకు ఆహారం వేస్తే మరింత కలిసి రానుంది. ఆ ఇంటి సుఖ శాంతులు కల్గనున్నాయని మైపాండిట్ సీఈవో కల్పేష్ షా తెలిపారు.
Also read:CM Kcr on BJP: ఢిల్లీలో వచ్చేది మన ప్రభుత్వమే..మరోమారు ప్రధాని మోదీపై కేసీఆర్ ధ్వజం..!
Also read:Somasial Project: సోమశిల ప్రాజెక్ట్‌కు ప్రమాదం పొంచి ఉందా.. దెబ్బతినడానికి కారణాలేంటి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి