Kidney Disease Symptoms: కిడ్నీ వ్యాధుల్ని పసిగట్టే 10 ముఖ్యమైన లక్షణాలివే

Kidney Symptoms: కిడ్నీ అనేది మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం. కిడ్నీ పనితీరుని బట్టి..ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని లక్షణాల్ని బట్టి కిడ్నీలు ఎలా ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 8, 2022, 05:39 PM IST
Kidney Disease Symptoms: కిడ్నీ వ్యాధుల్ని పసిగట్టే 10 ముఖ్యమైన లక్షణాలివే

Kidney Symptoms: కిడ్నీ అనేది మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం. కిడ్నీ పనితీరుని బట్టి..ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని లక్షణాల్ని బట్టి కిడ్నీలు ఎలా ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు..

శరీరంలో కీలకమైన అంగం కిడ్నీలు. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే తీవ్రమైన వ్యాధులు వెంటాడుతాయి. కొన్ని లక్షణాల్ని బట్టి కిడ్నీలో సమస్య ఉందని గుర్తించవచ్చు. కిడ్నీలు సహజసిద్ధమైన ఫిల్టర్‌గా పనిచేస్తాయి. శరీరంలోని విష పదార్ధాల్ని వడపోసి..బయటకు పంపించేది కిడ్నీలే. పోషక పదార్ధాల్ని రక్తంలోకి పంపిస్తుంటుంది. 

ఒకవేళ కిడ్నీలపై సరిగ్గా శ్రద్ధ పెట్టకపోతే..కిడ్నీ ఇన్‌ఫెక్షన్, కిడ్నీఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక రోగాల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే కిడ్నీలో ఏ చిన్న సమస్య ఉందని తెలిసినా వెంటనే చికిత్స చేయించాలి. లేకపోతే అది కాస్తా విషమించే ప్రమాదముంటుంది. కిడ్నీల్లో సమస్య ఉంటే ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తించాలి..అందుకే కొన్ని లక్షణాలతో కిడ్నీలు ఎలా ఉన్నాయనేది సులభంగా తెలుసుకోవచ్చు..

కిడ్నీ వ్యాధి లక్షణాలు

1. కిడ్నీల్లో ఏదైనా సమస్య ఉంటే మీకు క్రమంగా ఆకలి తగ్గిపోతుంది. అంతేకాకుండా వాంతులు, కడుపులో సమస్య, కడుపు తిప్పడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. బరువు కూడా తగ్గుతుంటారు.

2.  ప్రస్తుత ఒత్తిడితో కూడిన జీవితంలో నిద్ర సమస్య అందరికీ ఉంటోంది. ఇదొక సాధారణ సమస్యగా మారిపోయింది. నిద్రపోదామనుకున్నా..గంటల తరబడి అటూ ఇటూ దొర్లుతుంటారు కానీ నిద్ర పట్టదు. ఇలాంటి పరిస్థితి తరచూ ఉంటే కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. నిద్రలేమి, క్రానిక్ కిడ్నీ రోగం మద్య సంబంధముందని వివిధ అధ్యయనాల్లో తేలింది. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర చాలా అవసరం

3. కిడ్నీ అనేది శరీరంలోని విష పదార్ధాల్ని బయటకు పంపిస్తుంది. కిడ్నీ ఈ పని సరిగ్గా చేయకపోతే..ఆ ప్రభావం మెదడుపై పడుతుంది. ఫలితంగా మెదడుకు అవసరమైన ఆక్సిజన్ అందదు. తల తిరగడం, ఏకాగ్రత లోపించడం, మెమరీ తగ్గడం వంటి లక్షణాలు కన్పిస్తాయి.

4. కండరాలు పట్టేసినట్టుండటం కూడా కిడ్నీ వ్యాధి లక్షణమే. కాల్షియం, సోడియం, పొటాషియం ఇతర ఎలక్ట్రోలైట్స్ స్థాయి సరిగ్గా లేకపోతే ఈ సమస్య ఎదురౌతుంది. ఇలాంటి సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

5. శరీరంలోని విష పదార్ధాల్ని ఫిల్టర్ చేయడం కిడ్నీ పని. కిడ్నీ ఈ పని సరిగ్గా చేయకపోతే వివిధ సమస్యలు తలెత్తుతాయి. నోటి దుర్వాసన అధికమౌతుంది. రక్త సరఫరాలో విష పదార్ధాలు ఉండటం వల్ల తినే భోజనం రుచిగా కూడా ఉండదు.

6. కిడ్నీ శరీరం నుంచి ఎక్కువగా ఉన్న సోడియంను బయటకు పంపించేస్తుంది. తద్వారా ఆరోగ్యంగా ఉంటాం. కిడ్నీ సోడియం స్థాయిని పూర్తిగా బయటకు పంపించకపోతే అదంతా శరీరంలో పేరుకుపోతుంది. ఫలితంగా కాళ్లు, ముఖం వాపు కన్పిస్తుంది.

7. కిడ్నీలు విషపదార్ధాల్ని వడపోసి శరీరం నుంచి బయటకు పంపిస్తాయి. కిడ్నీ ఈ పని చేయడంలో విఫలమైతే..విష పదార్ధాలు రక్తంతో పాటు ప్రవహిస్తాయి. ఫలితంగా శరీరంలోని వివిధ భాగాల్లో దురద వస్తుంది. కిడ్నీ..మినరల్స్, ఇతర పోషకాల్ని బ్యాలెన్స్ చేయకపోతే ఎముకలకు సంబంధించిన సమస్యలు ఎదురౌతాయి. చర్మం కూడా ఎండిపోయినట్టు ఉంటుంది.

8. కిడ్నీ సమస్య ఉన్నప్పుడు శరీరంలో రెడ్ బ్లెడ్ సెల్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఆ వ్యక్తి ఎనీమిక్‌గా మారిపోతాడు. దాంతో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

9. కిడ్నీలు సహజసిద్ధమైన ఫిల్టర్‌లా పనిచేస్తాయి. ఈ ఫిల్టరేషన్ విఫలమైతే శరీరంలో విష పదార్ధాలు భారీగా పేరుకుపోతాయి. ఫలితంగా తీవ్రమైన అలసట వస్తుంది. బలహీనతతో పాటు ఏకాగ్రత కూడా లోపిస్తుంది. 

10. కిడ్నీలో ఏదైనా సమస్య ఉంటే మీ మూత్రం రంగు ద్వారా సులభంగా గుర్తించవచ్చు. మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా విసర్జితమౌతాయి. దీనినే ఆల్బూమిన్‌గా పిలుస్తారు. కిడ్నీలో సమస్య ఉన్నప్పుడు మూత్రం రంగు మారిపోతుంది. మూత్రం నుంచి రక్తం వస్తుంటే..కిడ్నీలో రాళ్లు, ట్యూమర్ లేదా ఇన్‌ఫెక్షన్ ఉందని అర్ధం. 

Also read: Prostate Cancer Symptoms: మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News