Drunk Woman Creates Ruckus: ఫుల్లుగా తాగి రోడ్డెక్కిన మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Drunk Woman Creates Ruckus on Road: కామారెడ్డి: సాధారణంగా మగవాళ్ళు పీకలదాకా మద్యం సేవించి వీరంగం సృష్టించడం లాంటి ఘటనలు మనం సాధారణంగానే అనేకం చూస్తుంటాం కానీ ఒక మహిళ ఫుల్ బాటిల్ మందు పీకల్లోతు తాగి పబ్లిగ్గా వీరంగం వేయడం ఎప్పుడైనా చూశారా ?

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2022, 08:19 PM IST
Drunk Woman Creates Ruckus: ఫుల్లుగా తాగి రోడ్డెక్కిన మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Drunk Woman Creates Ruckus on Road: కామారెడ్డి: సాధారణంగా మగవాళ్ళు పీకలదాకా మద్యం సేవించి వీరంగం సృష్టించడం లాంటి ఘటనలు మనం సాధారణంగానే అనేకం చూస్తుంటాం కానీ ఒక మహిళ ఫుల్ బాటిల్ మందు పీకల్లోతు తాగి పబ్లిగ్గా వీరంగం వేయడం ఎప్పుడైనా చూశారా ? అఫ్‌కోర్స్.. అప్పుడప్పుడు అలాంటి దృశ్యాలు కూడా చూస్తూనే ఉన్నాం అని అనుకున్నా.. ఇప్పుడు మీరు చూడబోయే ఘటన మాత్రం మరీ వెరైటీ. ఫుల్లుగా మద్యం సేవించిన ఓ మహిళ బస్టాండ్ ముందు రోడ్డుపై బైఠాయించి తనకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగి వీరంగం వేసిన ఘటన గురువారం రాత్రి కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది.

కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద పూటుగా మద్యం సేవించిన ఓ మహిళ.. నడిరోడ్డుపై కూర్చొని ధర్నా చేస్తూ సుమారు గంటపాటు ట్రాఫిక్‌కి అంతరాయం కలిగించింది. తను డైలీ ఫుల్ బాటిల్ తాగి ఇంటికి పోతే మొగుడు కొట్టి ఇంట్లోంచి తరిమేస్తున్నాడని.. ఈ విషయంలో ఎలాగైనా తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వీరంగం వేసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ మహిళను అక్కడి నుంచి పంపించేసి ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో ఆ మార్గం ద్వారా వెళ్తున్న వాహనదారులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి గ్రామానికి చెందిన సదరు మహిళ మేస్త్రి పని కోసం కామారెడ్డికి వచ్చి తన కుటుంబంతో సహా గత కొంతకాలంగా అక్కడే స్థిరపడింది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన ఆమె రెండో పెళ్లి చేసుకొని తన భర్తతో కలిసి మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వీరికి ముగ్గురు సంతానం కాగా.. కొద్ది కొద్దిగా మద్యం అలవాటున్న సదరు మహిళ ఫుల్ బాటిల్ తాగేంతవరకు బానిసైంది. దీంతో ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతుండడంతో ఈ మహిళ మద్యానికి బానిసై నిత్యం తాగి వస్తుండడంతో భరించలేని భర్త తరచుగా కొడుతున్నాడని తెలిసింది. అయినప్పటికీ ఆమె తాగుడు మానకపోవడంతో ఇంటికి రానివ్వడం లేదు. దీంతో భర్త తనను కొట్టకుండా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సదరు మహిళ ఇలా రోడ్డెక్కి వీరంగం సృష్టించింది. 

Trending News