Banana Weight Loss Tips: ప్రస్తుత కాలంలో బరువు తగ్గాలని కసరత్తులు చేసేవారు చాలా మందే ఉన్నారు. కసరత్తులు అయితే చేస్తున్నారు కానీ.. ఏ ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతామో, పెరుగుతామో చాలా మందికి ఓ కన్ఫ్యూజన్ ఉంది. ముఖ్యంగా అరటి పండు విషయంలో. అరటి పండు తింటే.. బరువు తగ్గుతామా? లేదా పెరుగుతామా అనే విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకూ అందరూ ఇష్టంగా తినే అరటి పండుపై నిపుణులు ఓ క్లారిటీ ఇచ్చారు.
అరటి పండులో పొటాషియం, పీచు, ఆరోగ్యకర కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజులో రెండు లేదా మూడు అరటిపండ్లు తినాలని వైద్యులు సూచిస్తారు. అయితే ఎక్కువ మొత్తంలో తింటామంటే మాత్రం కుదరదు. సింపుల్‌గా చెప్పాలంటే.. అరటి పండు జీరో ఫ్యాట్ ఫుడ్. మీడియం అరటి పండులో 100 కంటే తక్కువ కేలరీలు ఉంటాయి. యాపిల్‌తో పోల్చితే.. అరటి పండులో నాలుగు రెట్లు ప్రొటీన్లు, రెండు రెట్లు కార్బోహైడ్రేట్లు, మూడు రెట్లు పొటాషియం, రెండు రెట్లు విటమిన్ సి, ఐరన్ మరియు ఫాస్పరస్ ఉంటాయి.
రోజుకు మూడు మించకుండా తింటే అరటి పండ్లతో ఐదు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు తగ్గేందుకు అరటి పండ్లు ఉపయోగపడుతాయని తెలిపారు. అరటి పండ్లు తింటే బరువు పెరుగుతారనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. అరటి పండ్లను ఉదయం అల్పాహారంగా తీసుకుంటే మంచిదని పేర్కొన్నారు. లేదా వ్యాయామానికి ముందు తీసుకోవాలట. ముఖ్యంగా బరువు తగ్గడంలో, జీర్ణ క్రియ మెరుగు పడటంలో సహాయం చేస్తుంది.
బరువు తగ్గొచ్చు:
అధిక బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ అరటి పండును తినొచ్చు. ఒక్క అరటి పండులో 100 కేలరీల శక్తి ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అరటి పండు తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. కేలరీలు ఎక్కువగా తీసుకునే ప్రమాదం ఉండదు. దీంతో ఈజీగా బరువు తగ్గొచ్చు.
శక్తి స్థాయిని పెంచుతుంది:
అరటి పండ్లు శక్తి స్థాయిలను పెంచడంలో సహాయం చేస్తుంది. అంతేకాదు రోజంతా అలసటను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎనర్జీ డ్రింక్స్ కంటే అరటి పండ్లు ఆరోగ్యకరమైవి. అందుకే రోజుకు రెండు అరటి పండ్లు తింటే.. మనం రోజువారీ కార్యకలాపాలు చేసుకునేందుకు కావాల్సిన శక్తి వస్తుంది.
చర్మ సౌందర్యం:
అరటి పండులో మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. రోజూ అరటి పండ్లను తినడం వల్ల చర్మంపై ముడతలు, మొటిమలు, పొడి చర్మం లాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
నిద్రలేమికి చెక్:
నిద్రపోవడం సమస్యగా ఉంటే.. స్లీపింగ్ పిల్ వేసుకోకుండా వంట గదికి వెళ్లి అరటి పండును తినండి. అరటి పండులో అధిక మెగ్నీషియం, పొటాషియం మరియు ట్రిప్టోఫాన్ కంటెంట్ కారణంగా హాయిగా నిద్ర పడుతుంది.
హ్యాంగోవర్‌కు మందు:
హ్యాంగోవర్‌లకు అరటి పండు సరైన పరిష్కారం. అరటి పండులో సహజమైన యాంటాసిడ్ ఉంటుంది కాబట్టి తలనొప్పి, వికారం నుంచి బయటపడొచ్చు.
బీపీ కంట్రోల్:
అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండెకు మెరుగైన రక్షణను ఇస్తుంది. అంతేకాదు బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది.
కంటిచూపు మెరుగు:
ప్రతిరోజూ అరటి పండ్లు తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. అరటి పండ్లలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆస్తమా పేషంట్లు కూడా ఈ పండును తినొచ్చు.
Also Read: Virat Kohli: తమ టార్గెట్ అంతా టీ20 వరల్డ్ కపే..భారత మాజీ సారధి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు..!
Also Read: Virat kohli Records: విరాట్ కోహ్లీ 71వ సెంచరీ.. నమోదైన టాప్ రికార్డులు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి