భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు

స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్‌ తగ్గిపోవడం, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు వస్తుండటంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి.

Last Updated : May 17, 2018, 09:38 AM IST
భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు

స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్‌ తగ్గిపోవడం, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు వస్తుండటంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజే రూ.430 తగ్గిపోయింది. నేటి మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.430 తగ్గి రూ.32,020గా నమోదైంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.250 తగ్గి రూ.40,650గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ బాగా తగ్గిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పడిపోయాయి. న్యూయార్క్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1300 డాలర్లుగా, వెండి ధర 1.52శాతం తగ్గి 16.24డాలర్లుగా ఉంది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.430 తగ్గి రూ.32,020గా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.31,870గా ఉంది.

అటు.. దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్‌ 156 పాయింట్లు నష్టపోయి 35,388 వద్ద ముగిసింది. నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 10,741 వద్ద ముగిసింది.

Trending News