Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోమారు స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర అధ్యక్షుడు వస్తారని స్పష్టం చేశారు. తాను పార్టీ అధ్యక్ష పదవికి దూరంగా ఉండదల్చుకున్నానని తెలిపారు. ఈ విషయంపై చాలా సార్లు స్పష్టత ఇచ్చానని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సభ్యుడిగానే భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నానన్నారు. ఈమేరకు కేరళ మీడియాతో రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు.
రాహుల్ గాంధీయే కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతారని ప్రచారం జరుగుతోంది. ఈమేరకు చాలా రాష్ట్రాల పీసీసీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నాయి. రాహుల్‌నే ఏకగ్రీవంగా ఏఐసీసీ అధ్యక్షుడిని చేయాలని తీర్మానాలు ప్రవేశ పెట్టి..ఆమోదం తెలుపుతున్నారు. ఇటీవల తెలంగాణ పీసీసీ కీలక తీర్మానం చేసింది. రాహుల్ గాంధీయే అధ్యక్షుడు కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టగా..ఆ పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఇలా చాలా రాష్ట్రాలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. ఐతే ఢిల్లీలో మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఈసారి గాంధీయేతర సభ్యులు చీఫ్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. రోజురోజుకు కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని సీనియర్ నేతలు శశిథరూర్‌తోపాటు ఇతర నేతలు కలిశారు. తదుపరి ఏఐసీసీ అధ్యక్షుడిగా శశిథరూర్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈమేరకు సోనియా గాంధీ హామీ ఇచ్చారని తెలుస్తోంది.
తాజాగా దిగ్విజయ్ సింగ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌లో ఆయన ఎన్నో ఏళ్లుగా సేవలు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీకి పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. గతంలోనే దిగ్విజయ్ సింగ్ అనేక పదవులకు వన్నె తెచ్చారు. ఈనేపథ్యంలో కీలక పదవి ఇస్తారన్న ప్రచారం ఉంది. ఐతే దీనిపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోంది. అక్టోబర్ 17న పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అక్టోబర్ 17న ఎన్నికల తర్వాత తుది ఫలితాలను వెల్లడించనున్నారు. ఐతే ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా ఎన్నిక ఉండాలని మరికొంతమంది నేతలు యోచిస్తున్నారు. ఆ దిశగా మంతనాలు జరుపుతున్నారు. ఎలాగైనా రాహుల్ గాంధీనే అధ్యక్ష పదవిలో ఉండేలా చూస్తామంటున్నారు. మరికొంతమంది నేతలు మాత్రం కొత్త రక్తం కావాలంటున్నారు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
Also read:TS Govt: జింఖానా గ్రౌండ్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్..నివేదిక ఇవ్వాలని ఆదేశం..!
Also read:Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అల్పపీడనం ముప్పు తప్పినట్లేనా?..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి