Indrakiladri: మహిషాసుర మర్ధినీగా అమ్మవారు.. దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు..

Indrakiladri: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఇవాళ మహిషాసుర మర్ధనీగా దర్శనమివ్వనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 4, 2022, 10:02 AM IST
Indrakiladri: మహిషాసుర మర్ధినీగా అమ్మవారు.. దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు..

Dussehra Celebrations in vijayawada 2022: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో విజయవాడ కనకదుర్గ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. జై దుర్గ నామస్మరణతో ఇంద్రకీలాద్రి పరిసరాలు హోరెత్తుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు మహిషాసుర మర్ధనీగా (Mahishasura Mardini)దర్శనమిస్తోంది. దీంతో ఆ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. ఈరోజున అమ్మవారిని దర్శించుకుంటే సర్వదోషాలు తొలగిపోవడంతోపాటు విజయం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. బుధవారం వచ్చే దసరా లేదా విజయదశమి వేడుకలతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.

సోమవారం అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చారు. నిన్న రెండు లక్షలకుపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. వివిధ సేవలు, టిక్కెట్‌లు, ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ.37.25లక్షల ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఉత్సవాలు ముగింపు రోజున కనకదుర్గమ్మకు కృష్ణానదిలో హంసవాహన సేవ నిర్వహించడం అనవాయితీ. అయితే ఈ విషయంపై అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి లక్ష క్యూసెక్కులకు పైగా వరదనీరు వస్తూ ఉండటంతో.. నదీవిహారాన్ని నిలిపివేసి, దుర్గాఘాట్‌ వద్ద తెప్పపై ఉత్సవమూర్తులను ఉంచి పూజాధికాలు పూర్తి చేయించాలని అధికారులు అనుకుంటున్నారు. 

Also Read: Dussehra 2022 Date: దసరా రోజూ చేయాల్సి కార్యక్రమాలు ఇవే.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News