Diabetes Control With Rice: మధుమేహం సమస్యలతో బాధపడుతున్న వారు భోజనంలో భాగంగా వైట్ రైస్ ను తీసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. కానీ ఈ వ్యాధిగ్రస్తులు వైట్ రైస్ ను రిఫ్రిజిరేటర్ లో పెట్టి మరసటి రోజు తినొచ్చని ఆధ్యాయాలు చెబుతున్నాయి. ఇలా ఫ్రిజ్‌లో వైట్ రైస్ ను పెట్టడం వల్ల అందులో ఉండే పిండి పదార్థాలు స్టార్చ్ రెసిస్టెంట్ స్టార్చ్ గా మారుతాయి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ వన్ మధుమేహం ఉన్నవారి రక్తంలో గ్లూకోస్ లెవెల్ ప్రభావితం చెంది చక్కర పరిమాణాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని న్యూట్రిషన్ అండ్ డయాబెటిస్ జనరల్ లో ప్రచురించారు. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు అన్నం తినాలనుకుంటే వండిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి ఆ మరుసటి రోజు తీసుకోవాలని అధ్యయనాలు పేర్కొన్నాయి.
వైట్ రైస్ వండిన 24 గంటల తర్వాత రిఫ్రిజిరేటర్ లో ఉంచి దానిని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు సులభంగా తగ్గుతాయని ప్రముఖ వైద్య నిపుణురాలు మఖిజా తన అధ్యయనం ద్వారా తెలిపారు.
అయితే అన్నం తినాలని కోరిక ఉన్నవారు ఇలా రైస్ ను ఫ్రిడ్జ్ లో 24 గంటలు ఉంచి ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ప్రస్తుతం చాలామంది మధుమేహంతో బాధపడుతున్న వారు వైట్ రైస్ ను విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పై చిట్కాను ఉపయోగించి అందరూ వైట్ రైస్ ను తినొచ్చని అధ్యయనాలు పేర్కొన్నాయి.
ఈ రైస్ వల్ల శరీరాన్ని కలిగే ప్రయోజనాలు:
ప్రి డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రైస్ చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు శరీరంలోని గ్లూకోజ్ పై ప్రభావం చూపుతాయి. దీంతో రక్తంలోని చక్కర పరిమాణాలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ డయాబెటిస్తో బాధపడుతున్నవారు తప్పకుండా ఇలా వైట్ రైస్ ని తినొచ్చు.
Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..
Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook