Snake Viral Video: ఎప్పుడైనా మీరు స్మశానంలో పాములను చూశారా..అయితే ఒక్కసారి ఈ వీడియోను చూడండి..

Snake Viral Video: హైదరాబాద్‌లో ఓ స్మశాన వాటికలో కొండచిలువ ప్రవేశించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ఈ పాము ఆరడుగుల పొడవుతో ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2022, 10:40 AM IST
  • హైదరాబాద్‌లోని ఫలక్ నుమ స్మశానంలో..
  • ఆరు అడుగులు కలిగిన కొండ చిలువ
  • నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్న పాము వీడియో..
Snake Viral Video: ఎప్పుడైనా మీరు స్మశానంలో పాములను చూశారా..అయితే ఒక్కసారి ఈ వీడియోను చూడండి..

Snake Viral Video: స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రస్తుతం ప్రపంచంలో జరిగిన అన్ని విషయాలు సులభంగా తెలుస్తున్నాయి. అంతేకాకుండా అన్ని రకాల విషయాలపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అయితే ఈ తరుణంలో సోషల్ మీడియా వినియోగదారులను ఆసక్తి పరిచే చాలా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో చూసి వినియోగదారులు తమ స్టైల్ లో స్పందిస్తున్నారు. మరికొందరైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదేమైనాప్పటికీ సమాచారాన్ని అయితే సులభంగా తెలుసుకోగలుగుతున్నారు.

పాము వీడియో వైరల్:
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలే ఉంటున్నాయి. అందులో ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలే అధికంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వైరల్ అవుతున్న పాముల వీడియోలను చూసి సోషల్ మీడియా వినియోగదారులు కొందరు ఆశ్చర్య పోతే.. మరికొందరైతే భయాందోళనలు చెందుతున్నారు.  అయితే ఇటీవలే ఓ పాము వీడియో నెట్టింట్లో తెగ వాయిదాలుగా మారింది. ఈ వీడియో ట్విట్టర్లో ప్రస్తుతం అత్యధిక వ్యూస్ ను సంపాదించుకుంది. 

 

హైదరాబాద్‌లోని ఫలక్ నుమకు చెందిన ఓ స్మశాన వాటికలో ఆరడుగుల కలిగిన పెద్ద కొండచిలువ తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అక్కడికి వెళ్లిన ఓ వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

స్పందించిన స్థానికులు:
ఆ స్మశాన వాటిక పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ వీడియోను చూసి స్పందించారు. చాలామంది పిల్లలు అప్పుడప్పుడు ఆడుకునేందుకు స్మశాన వాటికకు వెళ్తారని ఆ సందర్భంలో పిల్లలకు కొండచిలువ హాని చేయొచ్చని స్థానికులు అటవీశాఖ వారితో చెప్పడంతో..వారు స్థానికుల కోరిక మేరకు ఆ పామును గుర్తించి పట్టుకొని సురక్షిత ప్రాంతంలో వదిలేశారు.

మీరు ఆ వీడియోలో చూసినట్లయితే ఆరడుగుల కలిగిన పాము చూడడానికి ఎంతో భయానకంగా ఉంది. ఆ పాము చర్మంపై మచ్చలు ఉండి గోధుమ రంగు కలర్ తో చర్మాన్ని కలిగి ఉంది. అయితే అక్కడికి వెళ్లిన స్థానికులకు ఎలాంటి హాని కలిగించలేదు.

Also Read: Adipurush 3D Teaser: 3డీలో ఆదిపురుష్ టీజర్.. జండూబామ్ అన్నారంటూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

Also Read: Nagababu on Garikapati: చిరంజీవిని విసుక్కున్న గరికపాటి..నాగబాబు ఘాటు కౌంటర్.. అసూయ పుట్టాల్సిందే అంటూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News