IND vs SA: శ్రేయాస్ అయ్యర్ సెంచరీ.. రెండో వ‌న్డేలో భారత్ విజయం! సిరీస్ 1-1తో స‌మం

Shreyas Iyer Century helps India beat South Africa in 2nd ODI. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ విజయం సాధించింది. 279 పరుగుల లక్ష్యాన్ని 45.5 ఓవర్లలో ఛేదించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 9, 2022, 09:47 PM IST
  • శ్రేయాస్ అయ్యర్ సెంచరీ
  • రెండో వ‌న్డేలో భారత్ విజయం
  • సిరీస్ 1-1తో స‌మం
IND vs SA: శ్రేయాస్ అయ్యర్ సెంచరీ.. రెండో వ‌న్డేలో భారత్ విజయం! సిరీస్ 1-1తో స‌మం

Shreyas Iyer Century helps India beat South Africa in 2nd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. 279 పరుగుల లక్ష్యాన్ని గబ్బర్ సేన మూడు వికెట్లు కోల్పోయి 45.5 ఓవర్లలో ఛేదించింది. యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (109 నాటౌట్; 111 బంతుల్లో 15 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా.. మరో ప్లేయర్ ఇషాన్‌ కిషన్‌ (93; 84 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సులు) తృటిలో సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 

279 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కలేదు. ఓపెన‌ర్లు శిఖార్ ధావ‌న్ (13), శుభ్‌మ‌న్ గిల్‌ (28) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిషాన్ ఆచితూచి ఆడారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే.. వీలు చిక్కిన‌ప్పుడల్లా బంతిని స్టాండ్స్‌లోకి పంపారు. దాంతో భారత్ స్కోర్ పరుగులు పెట్టింది. ప్రొటీస్ బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొన్న ఈ జోడి 150కి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

35వ ఓవ‌ర్‌లో ఇషాన్ కిషాన్ ఇన్నింగ్స్ ముగిసింది. భారీ షాట్ ఆడిన ఇషాన్.. హెండ్రిక్స్ కు దొరికిపోయాడు. దాంతో ఏడు ప‌రుగుల దూరంలో సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు. ఇషాన్ స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు జతకలిశాడు. శాంసన్, శ్రేయ‌స్ వీలు చిక్కిన‌ప్పుడు బంతిని బౌండ‌రీకి పంపుతూ వేగంగా పరుగులు చేశారు. ఈ క్రమంలో అయ్యర్‌ శతకం బాదాడు. భారత్ మరో 25 బంతులు మిగిలి ఉండ‌గానే విజయాన్ని అందుకుంది. 

అంతకుముందు దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 278 రన్స్ చేసింది. ప్రొటీస్ బ్యాటర్లు ఐడెన్ మార్‌క్రమ్‌ (79; 89 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్), రీజా హెండ్రిక్స్‌ (74; 76 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. ఈ ఇద్దరి జోరు చూస్తే ప్రొటీస్ భారీ స్కోర్ చేస్తుందనిపించింది. బౌలర్లు విజృంభించడంతో 278 స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో మొహ్మద్ సిరాజ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్‌, షహబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్‌ తీశారు.

Also Read: Krithi Shetty Pics: రెడ్ శారీలో కృతి శెట్టి.. కుర్రాళ్ల మ‌దిని దోచుకుంటున్న బేబమ్మ!

Also Read: IND vs SA: రెండో వన్డేలో ఫన్నీ ఘటన.. టాస్‌ కాయిన్‌ మర్చిపోయిన జవగల్ శ్రీనాథ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News