Shani Margi On Dhanteras 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం తన రాశిని నిర్ణీత సమయంలో మార్చుకుంటుంది. సాధారణంగా శనిగ్రహం తన రాశిని మార్చడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. మరో మూడు రోజుల్లో అంటే అక్టోబరు 23న శనిగ్రహం కదలికలో రానుంది. అదే రోజు ధంతేరాస్ (Shani Margi On Dhanteras 2022) కావడం కూడా విశేషం. శని యెుక్క ఈ మార్గం ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ధనత్రయోదశి రోజున శనిదేవుడు మార్గంలో ఉండటం వల్ల కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది.
మేషం (Aries)- మకరరాశిలో శనిదేవుడు ప్రత్యక్ష సంచారం వల్ల మేషరాశివారు బెనిఫిట్స్ పొందనున్నారు. అంతేకాకుండా ఈ రాశివారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది.
తుల (Libra)- ఈ రాశుల వారికి కూడా శని మార్గం శుభప్రదం కానుంది. ఈ రాశి వారు వచ్చే రెండున్నరేళ్లలో చాలా లాభాలను ఆర్జిస్తారు. కష్టాలు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే అన్నీ పరిష్కారమవుతాయి. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)- శని ప్రత్యక్ష సంచారం వల్ల ఈ రాశివారికి గోల్డెన్ డేస్ మెుదలవుతాయి. ఈ రాశివారికి ధనలాభం ఉంటుంది. పాతబాకీలను తీరుస్తారు. పెండింగ్ లోఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీకు గౌరవం లభిస్తుంది. ప్రేమ వివాహాలలో వచ్చే సమస్యలను అధిగమిస్తారు.
మీనం (Pisces)- ధంతేరాస్ రోజున శని మార్గం మీనరాశి వారికి శుభప్రదం అవుతుంది. ఈ సమయంలో వారు చాలా లాభాలను పొందుతారు. మీరు పాతవ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. ఒత్తిడి పోతుంది. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు త్వరలో శుభవార్త వింటారు. ఆదాయం పెరుగుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి.
Also Read: Mercury transit: దీపావళి నుంచి ఆ రాశులవారికి ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి, ఊహించని డబ్బు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook