ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది కల్గిస్తుంటాయి. ఇందులో ముఖ్యమైంది బ్యాక్ పెయిన్. వీపు నొప్పి, నడుము నొప్పి వంటివి. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కడం.
గంటల తరబడి ఒకే పోశ్చర్‌లో కూర్చుని పనిచేయడం వల్ల బ్యాక్ పెయిన్ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. మజిల్స్ స్ట్రెచ్ అవడం వల్ల తీవ్రమైన నొప్పిని అనుభవిస్తుంటారు. ఫలితంగా ఏ పనీ చేయలేని పరిస్థితి ఉంటుంది. మీరు కూర్చునే పోశ్చర్ సరిగ్గా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే..సమస్య మరింత తీవ్రం కాకుండా ఉంటుంది. అదే సమయంలో కొన్ని సులభమైన చిట్కాలతో బ్యాక్ పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
1. ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్ లేదా మజిల్స్ స్ట్రెచ్ సమస్య ఉంటే మాలిష్ మంచి ఫలితాలనిస్తుంది. ఏ భాగంలో అయితే నొప్పి ఉందో..ఆ భాగంపై నూనె రాసి చేత్తో మర్దనా చేయించుకోవాలి. దీనివల్ల సత్వరం ఉపశమనం లభిస్తుంది.
2. మజిల్స్ స్ట్రెచ్ , నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు స్ట్రెచింగ్ మంచి ప్రత్యామ్నాయం. ఇలా చేయడం వల్ల మజిల్స్, లిగమెంట్స్, టేండన్లో నొప్పి సమస్యలు దూరమౌతాయి. ఆరోగ్య నిపుణుడి సలహా మేరకు స్ట్రెచింగ్ చేయాలి. ఈ పద్ధతి వల్ల మజిల్స్‌లో ఒత్తిడి తగ్గుతుంది.
3. మజిల్స్ పెయిన్, స్ట్రెచ్ సమస్యకు హాట్ అండ్ కోల్డ్ థెరపీ మెరుగైన ఫలితాలనిస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం కల్గిస్తుంది. హాట్ థెరపీ ద్వారా మజిల్స్ రిలాక్స్ అవుతాయి.
4. మజిల్స్ స్ట్రెచ్ లేదా బ్యాక్ పెయిన్‌కు మీరు ధరించే చెప్పులు కూడా కారణమే.
Also read: Green Vegetables: కేన్సర్ నుంచి బీపీ వరకూ..అన్ని వ్యాధుల్ని నియంత్రించే 6 ఆకుపచ్చ కూరగాయలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook