Revanth Reddy With Raghul Gandhi Yatra: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ఎంటరైంది. కర్ణాటక సరిహద్దులో రాహుల్ గాంధీకి గ్రాండ్ వెల్ కం చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా బ్రిడ్జి మీదుగా.. నారాయణపేట జిల్లా గూడబల్లూరు సమీపంలోని కృష్ణ చెక్‌పోస్టు వద్ద తెలంగాణలోకి అడుగుపెట్టారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా బతుకమ్మలు, బోనాలు, డోలు వాయిద్యాలతో తెలంగాణ పీసీసీ నేతలు రాహుల్ కు స్వాగతం చెప్పారు. తెలంగాణ ఎంట్రీ దగ్గర కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. రాహుల్ యాత్రకు విడ్కోలు చెప్పి జాతీయ జెండాను తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి అందించారు.
తొలి రోజు తెలంగాణలో కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే నడిచారు రాహుల్ గాంధీ. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్ తో ఇతర కాంగ్రెస్ నేతలు రాహుల్ తో కలిసి నడిచారు. జాతీయ జెండాను పట్టుకుని రాహుల్ వెంట నడిచారు రేవంత్ రెడ్డి. రాహుల్ పక్కన రేవంత్ రెడ్డి నడుస్తూ హల్చల్ చేశారు. పాదయాత్ర రేవంత్ రెడ్డి ముచ్చటిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు రేవంత్ రెడ్డి. గూడబల్లూరులో మాట్లాడిన రాహుల్ గాంధీ.. దేశ సమైక్యత కోసమే జోడో యాత్ర అని చెప్పారు. ఈ యాత్రను ఆపే శక్తి ఎవరికి లేదన్నారు.
Congress leader @RahulGandhi 's #BharatJodoYatra croses the bridge over #KrishnaRiver in Raichur dist of #Karnataka and enters Telangana in Mahabubnagar dist today. TPCC chief @revanth_anumula received #RahulGandhi at Raichur.#RevanthReddy #Telangana #Congress #Mahabubnagar pic.twitter.com/OWEVFi0wFl
— Surya Reddy (@jsuryareddy) October 23, 2022
తెలంగాణలో తొలి రోజు నారాయణపేట్ జిల్లా గూడబెల్లూర్‌లో యాత్రకు బ్రేక్ పడింది. దీపావళి పండుగ కారణంగా 24, 25 తేదీల్లో రాహుల్ గాంధీ యాత్రకు విరామం ఇచ్చారు. ఈనెల 26వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాహుల్ హాజరుకానున్నారు. మళ్లీ తిరిగి 27వ తేదీన తెలంగాణలో రాహుల్ పాదయాత్ర మొదలు కానుంది. తెలంగాణలో రాహల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొత్తం 13 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. 7 పార్లమెంట్ స్థానాలు, 17 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ కానున్నాయి. రాహుల్ యాత్రలో పాల్గొనాలని అధినేత్రి సోనియాతో పాటు ప్రియాంక గాంధీని కోరింది టీపీసీసీ. నవంబర్ 1న నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించే కార్యక్రమంలో సోనియా, ప్రియాంక గాంధీ పాల్గొంటారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. నవంబరు 7న కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ మద్నూర్ మండలంలోని శాఖాపూర్ వద్ద తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగియనుంది.
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక వేళ రాహుల్ గాంధీ యాత్ర రాష్ట్రంలోకి అడుగుపెట్టడం కాంగ్రెస్ వర్గాల్లో జోష్ నింపుతోంది. రాహుల్ కు స్వాహతం చెప్పేందుకు కాంగ్రెస్ నేతలు భారీగా తరలివచ్చారు. ఇక రాహుల్ యాత్రలో రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాహుల్ యాత్రను దిగ్విజయం చేసేలా పీసీసీ ప్లాన్ చేసింది. నవంబర్ 1న హైదరాబాద్ కు సోనియా, ప్రియాంక రానున్నారు. ఇవన్ని తమకు మునుగోడు ఉప ఎన్నికలో కలిసివస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు.
Read Also: Thalapathy Vijay Varasudu Audio Rights : : ఆడియో రైట్స్ కోసం అన్ని కోట్లా?.. హిస్టరీలోనే ఫస్ట్ టైం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook