టాలీవుడ్ నటుడు అలీకు ఎట్టకేలకు ప్రభుత్వ అధికారిక పదవి దక్కింది. ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారుడిగా అలీని నియమించింది.
2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ హాస్య నటుడు అలీ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు తన వంతు కృషి చేస్తానంటూ ఎన్నికల్లో పార్టీ నిర్దేశించిన ప్రాంతాల్లో పర్యటించారు. పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో గుంటూరు, రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని..ఎన్నికల అనంతరం కీలకమైన పదవులు ఇస్తారనే టాక్ వచ్చింది. తాను పదవుల కోసం పార్టీలో రాలేదని అలీ స్పష్టం చేశారు.
ఇటీవల అయితే ఏకంగా జనసేనలో చేరిపోతున్నారనే ప్రచారం గట్టిగా సాగింది. దీనిని అలీ స్వయంగా ఖండించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అలీని కీలకమైన పదవిలో రెండేళ్లపాటు కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అలీపై జరుగుతున్న ప్రచారానికి ఇక చెక్ పడినట్టే.
Also read: Yashoda Trailer: నీకు కావల్సింది డబ్బు.. వాళ్లకు కావాల్సింది బిడ్డ! ఆసక్తిగా యశోద ట్రైలర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook