Sunny Leone Remuneration : దారుణంగా జిన్నా కలెక్షన్స్.. సన్నీ లియోన్ రెమ్యూనరేషన్ కూడా రికవరీ కాలేదట!

Sunny Leone Remuneration సన్నీ లియోన్ జిన్నా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జిన్నా కలెక్షన్లు మరింత దారుణంగా ఉన్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2022, 01:05 PM IST
  • మంచు విష్ణు జిన్నా కలెక్షన్లు
  • కోటీ షేర్ కూడా సాధించలేని జిన్నా
  • సన్నీ లియోన్ రెమ్యూనరేషన్‌పై చర్చ?
Sunny Leone Remuneration : దారుణంగా జిన్నా కలెక్షన్స్.. సన్నీ లియోన్ రెమ్యూనరేషన్ కూడా రికవరీ కాలేదట!

Sunny Leone Remuneration : సన్నీ లియోన్ తెలుగు సినిమాల్లో నటించేందుకు భారీ మొత్తాన్నే కోట్ చేస్తోందన్న సంగతి తెలిసిందే. మామూలుగా ఐటం సాంగ్, స్పెషల్ అప్పీయరెన్స్‌ కోసమైనా కూడా భారీ మొత్తంలో వసూల్ చేస్తుంటుంది. అయితే జిన్నా కోసం చాలా కాల్షీట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. జిన్నా సినిమాలో సన్నీ లియోన్‌ది ఫుల్ లెంగ్త్ పాత్ర. అన్ని కారెక్టర్లంటే కూడా సన్నీ లియోన్ పాత్రకే ఎక్కువగా స్కోప్ దక్కింది. అయితే ఇప్పుడు జిన్నా కలెక్షన్ల లెక్కలు చూస్తుంటే మాత్రం దారుణాతి దారుణంగా ఉన్నాయి.

జిన్నా సినిమాకు మొదటి రోజు అంతో ఇంతో పాజిటివ్ టాక్ వచ్చింది. కామెడీ పర్వాలేదనిపించింది. మంచు విష్ణు డ్యాన్సులు, కామెడీ, చమ్మక్ చంద్ర వెన్నెల కిషోర్ ట్రాక్, సన్నీ లియోన్ నటన, అందాలు ఇవన్నీ కూడా ప్లస్ అయ్యాయి. అయితే సినిమా మీద వచ్చిన ఆ కాస్త పాజిటివ్ టాక్ కూడా కలెక్షన్ల రూపంలో మాత్రం మారలేదు. దీంతో సినిమా దారుణంగా బెడిసి కొట్టేసినట్టు అయింది.

ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో దారుణమైన పరాభవం ఎదురైంది. కనీసం రెండు వేల డాలర్లు కూడా రాకపోవడంతో అంతా షాక్ అయ్యారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో జిన్నా కలెక్షన్లు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు కోటి షేర్ కూడా రాలేదని తెలుస్తోంది.

 

ఇప్పటి వరకు ఈ చిత్రానికి దాదాపు 71 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చినట్టు సమాచారాం. ఈ లెక్కన కనీసం సన్నీ లియోన్ రెమ్యూనరేషన్ కూడా రికవరీ చేయలేకపోయిందని అంటున్నారు. ఈ సినిమా కోసం సన్నీ లియోన్ దాదాపు కోటి ముప్పై లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్.

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల టార్గెట్‌తో దిగింది. కానీ ఇంత వరకు కోటి కూడా వసూల్ చేయలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద జిన్నా డిజాస్టర్‌గా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా పాయల్‌ రాజ్‌పుత్‌కు ఎలా కూడా ఉపయోగపడలేదనిపిస్తోంది. మంచు విష్ణుకి నిర్మాతగా భారీ నష్టాలను తెచ్చి పెట్టినట్టు కనిపిస్తోంది.

Also Read : Rishab Shetty Meets Rajinikanth : కాంతారాపై సూపర్ స్టార్ ప్రశంసలు.. తలైవా కాళ్లు మొక్కిన రిషభ్ శెట్టి

Also Read : Anasuya Bharadwaj Food : నేను బాగా తింటున్నా.. కొవ్వు పెరుగుతోంది కానీ.. అనసూయ కామెంట్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News