Six Died in Anantapur: అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా కూలీలే. బొమ్మనహల్ మండలం దర్గాహొన్నూరులో కూలీలందరూ వ్యవసాయ పనులకు ట్రాక్టర్‌లో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ట్రాక్టర్‌లో వెళ్తున్న సమయంలో విద్యుత్ మెయిన్ లైన్ తెగి కూలీలపై పడింది. నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరస్తున్న సమయంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. విద్యుత్ అధికారులకు సమాచారం అందించి సరఫరా నిలిపివేయించారు. మరో ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఈ ఏడాది జూన్ 30న తాడిమర్రి మండలంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆటో కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తుండగా.. ఆటోపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఉన్న విద్యుత్ వైర్లను ఉడుత కొరకడంతో వైర్లు తెగి ఆటోపై పడ్డాయని అధికారులు అప్పట్లో చెప్పారు. ఈ ఘటనలో మరో నలుగురు తృటిలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. తాజాగా ఇలానే మరో ఆరుగురు కూలీలు మృతిచెందడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ ఘటనలో ఏడీ, ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఘటనపై విద్యుత్ శాఖ భద్రతా డైరెక్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిస్కంను ఆదేశించింది.
Also Read: Heavy Rains: భారీ వర్షాలతో అతలాకుతలం.. అక్కడ పాఠశాలలకు సెలవు
Also Read: Twitter: ట్విట్టర్‌లో ఈ తప్పులు చేస్తే జైలుకే.. ఈ విషయాలు తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook