Heavy Rains: భారీ వర్షాలతో అతలాకుతలం.. అక్కడ పాఠశాలలకు సెలవు

Heavy Rains in Chennai: తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రభుత్వం ఆరు జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2022, 03:12 PM IST
Heavy Rains: భారీ వర్షాలతో అతలాకుతలం.. అక్కడ పాఠశాలలకు సెలవు

Heavy Rains in Chennai: తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నిన్న ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతోపాటు ముఖ్య నగరాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెన్నైలోని పలు రహదారులపై భారీ ట్రాఫిక్‌ కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. చెన్నైలోని పులియంతోప్‌లో బాల్కనీ కూలి ఓ మహిళ, వ్యాసర్‌పాడిలో విద్యుదాఘాతంతో ఆటో డ్రైవర్‌ మృతి చెందారు. 

ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కూలిన చెట్లను, డ్రైనేజీని తొలగిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటంచారు అక్కడి అధికారులు. నుంగం బాక్కంలో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క రోజే  8 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు. చెన్నై విషయానికొస్తే.. గత 36 గంటల్లో 15 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అయితే గత ఏడాది కంటే వర్షాల వల్ల నష్టం చాలా తక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కేవలం రెండు చోట్ల మాత్రమే ఎక్కువగా ప్రభావితమైందంటున్నారు. 

తమిళనాడు, పుదువై, కారైకల్‌లో చాలా చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. బుధవారం కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, పుదుకోట్టై, తేని, దిండిగల్, మదురై, శివగంగై, విరుదునగర్, రామనాథపురం, తూత్తుకుడి, తిరునల్వేలి, తెంకాసి, కన్యాకుమారి, కరాయ్, పుదుచ్చేరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

అదేవిధంగా భారీ వర్షాల కారణంగా 6 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, విల్లుపురం, వెల్లూరు జిల్లాల్లోని పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. చెన్నైలోని కాలేజీలకు సెలవులు ప్రకటించారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్, తమిళనాడు, ఉత్తర శ్రీలంక తీరంలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో తుఫాను గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఈ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. 

Also Read: Twitter: ట్విట్టర్‌లో ఈ తప్పులు చేస్తే జైలుకే.. ఈ విషయాలు తెలుసుకోండి  

Also Read: Tika Dutta Pokharel: ఎన్నికల బరిలో వందేళ్ల వృద్ధుడు.. మాజీ ప్రధానిపై పోటీకి సై   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News