షేర్ మార్కెట్‌లో మరో ఐపీవో వస్తోంది. ఫైవ్‌స్టార్ బిజినెస్ ఐపీవో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. దాదాపు 2 వేల కోట్ల ఐపీవోగా ఉండనుంది. ఫైవ్‌స్టార్ బిజినెస్ అనేది మైక్రో ఫైనాన్స్ రంగంలో ప్రసిద్ధ కంపెనీ.
ఎన్బీఎఫ్‌సీ ఫైవ్‌స్టార్ బిజినెస్ ఫైనాన్స్ 1960 కోట్ల ఐపీవో నవంబర్ 9వ తేదీన ప్రారంభం కానుంది. చెన్నైకు చెందిన ఈ కంపెనీ ఐపీవో నవంబర్ 9వ తేదీన ప్రారంభమై..నవంబర్ 11న క్లోజ్ అవుతుంది.
ఫైవ్‌స్టార్ బిజినెస్ ఈ ఐపీవో కింద 1960 కోట్ల విలువైన షేర్లు విక్రయిస్తోంది. ఇందులో షేర్ హోల్డర్ల షేర్లు కూడా ఉన్నాయి. ఎన్బీఎఫ్‌సికు టీపీజీ, మ్యాట్రిక్స్ పార్టనర్స్, నార్వెస్ట్ వెంచర్స్, సికోయియా, కేకేఆర్ వంటి ప్రసిద్ధ ఇన్వెస్టర్ల మద్దతు లభిస్తోంది.
ప్రస్తుతం టీపీజీ ఆసియా కంపెనీలో 21.45 శాతం, మెట్రిక్స్ పార్టనర్స్ 12.67 శాతం, నార్వెస్ట్ వెంచర్స్ 10.17 శాతం, ఎస్‌సీఐ ఇన్వెస్ట్‌మెంట్ 8.79 శాతం భాగస్వాములుగా ఉన్నాయి. ఫైవ్‌స్టార్ బిజినెస్ అనేది మైక్రో ఫైనాన్స్ రంగంలో సుప్రసిద్ధ కంపెనీ. ఫైవ్‌స్టార్ కంపెనీ ఐపీవోపై మార్కెట్‌లో అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఇదికాకుండా మార్కెట్‌లో ఇంకా ఇతర ఐపీవోలు ప్రారంభం కానున్నాయి.
Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్, పెరగనున్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook