Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ... శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం..

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2022, 08:35 AM IST
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ...  శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం..

Devotees Huge Rush At Tirumala Temple: తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వీకెండ్ కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. దీంతో తిరుగిరులు జన సంద్రాన్ని తలపించాయి. క్యూ కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి.  స్వామివారిని (Lord Venkateshwara) 57,104 మంది భక్తులు దర్శించుకోగా... 32,351 మంది తలనీలాలు సమర్పించి మెుక్కులు తీర్చుకున్నారు.  రూ.4.66 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. సర్వదర్శనానికి 40 గంటలు సమయం పడుతుండగా... ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల టైం పడుతున్న టీటీడీ అధికారులు వెల్లడించారు. 

తిరుమలలో ఒక్క పక్క వర్షం.. మరో పక్క చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు సెలవు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. దీంతో తిరుమలలోని చెక్ పాయింట్ల వద్ద తనిఖీల కోసం వెహికల్స్ బారుల తీరాయి. క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే వాహనాలను ముందుకు పంపుతున్నారు. 

మరో వైపు, సంకటహర చతుర్థిని పురష్కరించుకుని కాణిపాకం స్వయంభు గణపతి స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు అభయ హస్తం అందించారు. ఆలయంలో పవిత్రోత్సవాలు, మండల పూజల్లో భాగంగా రెండో రోజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వారాంతం కావడంతో కాణిపాకంలోనూ భక్తుల రద్దీ భారీగానే ఉంది. వరసిద్ధి వినాయకుడిని దర్శించుకునేందుకు సుమారు నాలుగు గంటలు సమయం పడుతుంది. 

Also Read: Navpancham Rajyog: 12 ఏళ్ల తరువాత 'నవ పంచమ రాజయోగం'.. ఈ 3 రాశుల వారికి ధనలాభం... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News