Aamir khan big break : సినిమాలకు ఆమీర్ ఖాన్ బిగ్ బ్రేక్.. ఎందుకో తెలుసా?

Aamir khan big break : వరుస డిజాస్టర్ సినిమాలు అందుకున్న ఆమీర్ ఖాన్ ఇప్పుడు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుననట్టు ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 15, 2022, 03:01 PM IST
Aamir khan big break : సినిమాలకు ఆమీర్ ఖాన్ బిగ్ బ్రేక్.. ఎందుకో తెలుసా?

Aamir khan is taking a big break : లాల్ సింగ్ చద్దా లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మీడియాకు ముఖం చాటేసిన అమీర్ ఖాన్ చాలా కాలం తర్వాత సోమవారం ప్రజల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా, ఒక చాట్ సెషన్‌లో పాల్గొన్న అమీర్ ఖాన్ తన భవిష్యత్తు ప్రణాళికల గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ఈ సంభాషణలోనే ఆయన కొంతకాలం నటన నుండి విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు.

ఆయన మాట్లాడుతూ “నటుడిగా సినిమా చేస్తున్నప్పుడు జీవితంలో ఇంకేమీ జరగనంతగా అందులో మునిగిపోయానని అలా తాను  లాల్ సింగ్ చద్దా తర్వాత నేను ఛాంపియన్స్ సినిమా చేయాల్సి వచ్చిందని అన్నారు. ఆ  ఛాంపియన్స్ సినిమాకు ఒక అద్భుతమైన స్క్రిప్ట్, అందమైన కథ, ఉందని ఇది చాలా మధురమైన చిత్రం అని అయితే తాను వెంటనే ఆ సినిమా చేయాలని భావించడం లేదని అన్నారు. నేను కొంత విరామం తీసుకోవాలని భావిస్తున్నాను.

నేను నా కుటుంబంతో, నా తల్లితో, నా పిల్లలతో ఉండాలనుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా నటుడిగా విరామం తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘ఛాంపియన్‌’ చిత్రానికి సంబంధించి ఓ పెద్ద అప్‌డేట్‌ కూడా ఇచ్చారు. తన తదుపరి చిత్రం ఛాంపియన్ అని అయితే ఈ చిత్రంలో నేను నిర్మాతగా యాక్టివ్ గా ఉంటానని అనాన్రు, ఆ పాత్ర కోసం మరో నటుడి కోసం వెతుకుతానని అమీర్ తెలిపారు. విశేషమేమిటంటే, అమీర్ చివరిగా 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో కనిపించారు. ఈ సినిమాతో నాలుగేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది.

నాగచైతన్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయినది కానీ జనానికి ఏమాత్రం ఎక్కలేదు. ఇక అమీర్ ఖాన్ కంటే ముందు, షారుక్ ఖాన్ 2018లో 'జీరో' ఫ్లాప్ అయిన తర్వాత నటనకు విరామం తీసుకున్నారు. ఇప్పుడు షారుక్ 4 ఏళ్ల తర్వాత మళ్లీ నటించబోతున్నారు. 2022 సంవత్సరంలో, షారుఖ్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' మొదలు 'బ్రహ్మాస్త్ర', 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' వరకు చిత్రాలలో అతిథి పాత్రల్లో కనిపించాడు. త్వరలో 'పఠాన్', 'టైగర్ 3' సినిమాల ద్వారా ఆయన హీరోగా కనిపించనున్నారు.
Also Read: Siri-Shrihan : శ్రీహాన్ లవర్‌ను ఎత్తుకున్న మానస్.. బిగ్ బాస్ బ్యూటీ సిరి పిక్స్ వైరల్

Also Read: Adipurush Hindi Teaser : కొత్త రికార్డ్.. బాలీవుడ్‌ వెన్నులో వణుకు.. ప్రభాస్ క్రేజ్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News