Ghost Video: మరణించిన పేషెంట్ మళ్లీ వచ్చాడు.. దెయ్యంతో మాట్లాడిన గార్డు.. సీసీ కెమెరాలో రికార్డు

Ghost Patient Video Hospital: అనుకోకుండా ఆ ఆసుపత్రి డోర్లు ఓపెన్ అయ్యాయి. ఇంతలో ఆసుపత్రి గార్డుపైకి లేచి మాట్లాడాడు. వివరాలు నమోదు చేసుకుని వీల్ ఛైర్‌ ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే.. అక్కడ ఎవరు లేరు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ వీడియో వైరల్ అవుతోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 10:11 AM IST
  • మరణించిన పేషెంట్ మళ్లీ వచ్చాడు
  • దెయ్యంతో మాట్లాడిన గార్డు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Ghost Video: మరణించిన పేషెంట్ మళ్లీ వచ్చాడు.. దెయ్యంతో మాట్లాడిన గార్డు.. సీసీ కెమెరాలో రికార్డు

Ghost Patient Video Hospital: దెయ్యం పేరు చెప్పగానే మనలో చాలా మందికి వణుకు పుడుతుంది. అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా అనే వాదన పక్కన బెడితే.. అదిగో దెయ్యం.. ఇదిగో దెయ్యం వీడియోలో రికార్డు అయిందంటూ నెట్టింట వైరల్ అవుతున్న ఎన్నో వీడియోలు చూస్తున్నాం. తాజాగా ఇప్పుడు కూడా దెయ్యంతో ఓ గార్డు మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. అర్జెంటీనా నుంచి వచ్చిన ఈ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్న వీడియోను మిలియన్ల కొద్ది చూస్తున్నారు.

బ్యూనస్ ఎయిర్స్‌లోని ఫినోచియాటో శానిటోరియం అనే ప్రైవేట్ కేర్ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు ఆసుపత్రిలో అమర్చిన సీసీటీవీలో ఈ వీడియో రికార్డు అయింది. వీడియో స్టార్ట్ అయిన వెంటనే.. హాస్పిటల్ ప్రవేశ ద్వారం తలుపు ఆటోమేటిక్‌గా తెరుచుకున్నాయి. సెక్యూరిటీ గార్డు శబ్దం విని తన సీటులో నుంచి లేచి.. డెస్క్‌పై ఉన్న క్లిప్‌బోర్డ్‌ని తీసుకుని తలుపు వైపు కదిలాడు. 

లైన్ డివైడర్‌ను తీసివేసి అతను అంతకే మాట్లాడటం ప్రారంభించాడు. కానీ ఎదురుగా ఎవరులేరు. ఆ తరువాత ఓ వీల్ చైర్‌లో కూర్చొబెట్టి ముందుకు వెళ్లు అన్నట్లు ఉంది. ఈ వీడియోలో సెక్యూరిటీ గార్డు ప్రవర్తన చూసి సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. అంతకుముందు రోజు ఆసుపత్రిలో ఓ పేషంట్ మరణించాడని.. అతనే దెయ్యం రూపంలో వచ్చాడని ప్రచారం జరుగుతోంది.

 

ఫుటేజీని చూసి కొంతమంది యూజర్లు భయపడిపోగా.. మరికొంతమంది ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. వీడియో రికార్డు అవుతుందని తెలిసే.. ఆ గార్డు అలా చేశాడని అంటున్నారు. అయితే ఈ విషయంపై స్థానిక మీడియా డైలీస్టార్ ఆరా తీయగా.. డోర్ విరిగిపోయిందన  గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం మధ్య 10 గంటల మధ్య 28 సార్లు ఆటోమేటిక్‌గా తెరుచుకుందని యాజమాన్యం తెలిపింది. వీడియో క్లిప్‌బోర్డ్ పేపర్‌పై సెక్యూరిటీ గార్డు ఏదో రాస్తున్నట్లు కనిపించగా.. రిజిస్టర్‌లో ఏం రాయలేదని స్పష్టం చేసింది. 

Also Read: Nicholas Pooran: టీ20 వరల్డ్ కప్‌ ఎఫెక్ట్.. కెప్టెన్సీకి నిలోలస్ పూరన్ గుడ్ బై    

Also Read: Viral: మీరు ఇది విన్నారా... కర్మకాండలకూ ఓ స్టార్టప్‌ ఉందంట..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News