Manchu Vishnu Birthday : లేటుగా విష్ చేశాడట.. వెన్నెల కిషోర్ మీద మంచు విష్ణు ఫైర్.. నెటిజన్ల ట్రోలింగ్

HBD Manchu Vishnu మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా నిన్నంతా కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి కనిపించలేదు. మంచు విష్ణుకు ఎక్కువ మంది సెలెబ్రిటీలు విషెస్ అందించినట్టు కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 08:46 AM IST
  • మంచు విష్ణు బర్త్ డే స్పెషల్
  • వెన్నెల కిషోర్ వెరైటీ పోస్ట్
  • లేట్ విషెస్ అంటూ మంచు విష్ణు రిప్లై
Manchu Vishnu Birthday : లేటుగా విష్ చేశాడట.. వెన్నెల కిషోర్ మీద మంచు విష్ణు ఫైర్.. నెటిజన్ల ట్రోలింగ్

Manchu Vishnu Fires on Vennela Kishore : వెన్నెల కిషోర్ మంచు విష్ణు ట్రాక్ గత కొన్ని రోజులుగా నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది. జిన్నా ప్రమోషన్స్‌లో భాగంగా వెన్నెల కిషోర్‌ను మంచు విష్ణు బాగానే వాడేశాడు. వెన్నెల కిషోర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశాడు మంచు విష్ణు. పొగరు, బలుపు, యారగెన్స్ ఇలా నానా రకాలుగా తిట్టేశాడు. నాకు ఇష్టమైన నటుడు అంటూ పొగుడుతూనే స్టేజ్ మీద వెన్నెల కిషోర్‌ను ఎన్ని అనాలో అన్నీ అనేశాడు మంచు విష్ణు.

ఇలా వెన్నెల కిషోర్, మంచు విష్ణు కామెడీని జనాలు కూడా సోషల్ మీడియాలో ఎంజాయ్ చేస్తుంటారు. జిన్నా సినిమాలో మంచు విష్ణు వెన్నెల కిషోర్ చమ్మక్ చంద్ర ట్రాక్ బాగానే వర్కౌట్ అయింది. సెకండాఫ్ మొత్తం కూడా ఈ ముగ్గురిదే హవా. అందులోనూ చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ అయితే జనాలను తెగ నవ్వించేస్తుంటుంది. జిన్నా సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. అది వేరే విషయమనుకోండి. కానీ వెన్నెల కిషోర్‌ను మాత్రం విష్ణు ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు.

నిన్న (నవంబర్ 23) మంచు విష్ణు బర్త్ డే. మంచు లక్ష్మీ, మనోజ్ ఇలా అందరూ కూడా విష్ణుకి విషెస్ అందించారు. జంబలకిడి జారుమిఠాయా అనే పాట పాడించి మరి మనోజ్ తన అన్నకి విషెస్ చెప్పాడు. ఇక మంచు లక్ష్మీ సైతం తన స్టైల్లో విషెస్ చెప్పింది. వెన్నెల కిషోర్ కూడా ట్వీట్ వేశాడు. మన డైనమిక్ హీరో మంచు విష్ణు గారికి హ్యాపీ బర్త్ డే.. సర్ జీ మీరు ఇలాంటి పుట్టిన రోజులెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని విషెస్ అందించాడు.

 

దానిపై తాజాగా మంచు విష్ణు స్పందించాడు. థాంక్యూ గానీ.. కాస్త ముందుగా విష్ చేయలేవా? ఇంత లేటుగానా?.. సో మంచ్ యారోగెన్స్ అంటూ కౌంటర్ వేశాడు. ఈ ట్వీట్ మీద జనాలు రకరకాలుగా స్పందిస్తూ సెటైర్లు వేస్తున్నారు. నీకు విష్ చేయడమే ఎక్కువ.. ఇంకా త్వరగా విష్ చేయవా? అని అడుగుతున్నావా? అంటూ నెటిజన్లు పరువుతీస్తున్నారు.

Also Read : Kamal Haasan Health : కమల్ హాసన్‌కు అస్వస్థత.. నిన్ననే అలా ఇప్పుడు ఇలా

Also Read : Shriya Saran lip lock : ఇది కామన్ ఏముంది అందులో.. బహిరంగంగా లిప్ లాక్ ట్రోలింగ్‌పై శ్రియా రియాక్షన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News