7th Pay Commission Update: త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా ఖాతాల్లో నగదు జమ..?

7th Pay Commission DA Hike Details: పెండింగ్‌ డీఏ బకాయిల కోసం కేంద్ర ఉద్యోగులకు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 18 నెలల డీఏ నిధులు విడుదలైతే.. ఉద్యోగుల ఖాతాల్లో ఎంత నగదు జమ కానుంది..? వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2022, 08:47 AM IST
7th Pay Commission Update: త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా ఖాతాల్లో నగదు జమ..?

7th Pay Commission DA Hike Details: కేంద్ర ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. త్వరలో వారి ఖాతాలో భారీ మొత్తం నగదు జమ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి 18 నెలల బకాయిలు (డీఏ బకాయిలు) త్వరలోనే జమ అవుతాయని చెబుతున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ సమావేశాల తరువాత.. త్వరలో రూ.2 లక్షలకు పైగా మొత్తం ఉద్యోగులకు అందుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. 

జనవరి 2020 నుంచి జూన్ 2021 మధ్య కరోనా ఎఫెక్ట్‌తో డీఎ (డియర్‌నెస్ అలవెన్స్) ఆర్థిక మంత్రిత్వ శాఖ చెల్లించలేదు. డీఏ బకాయిలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ కూడా ఇవ్వలేదు. 

పెండింగ్‌లో డీఏ బకాయిలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నేరుగా ఉద్యోగుల ఖాతాలో రూ.2 లక్షలు వచ్చే అవకాశం ఉంది. లెవల్ 1 ఉద్యోగులు రూ.11,880 నుంచి రూ.37,554 వరకు డీఏ బకాయిలు పొందవచ్చు. లెవల్-13 (7వ సీపీసీ బేసిక్ పే-స్కేల్) రూ.1,23,100 నుంచి రూ.2,15,900 లేదా లెవల్-14 (పే-స్కేల్) ఉద్యోగి ఖాతాలో డీఏ బకాయిలు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు పొందే అవకాశం ఉంది.

పెండింగ్‌లో ఉన్న 18 నెలలకు సంబంధించిన డీఏ బకాయిల కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్రీజ్ అయిన డీఏపై బదులుగా బకాయిలు చెల్లించబోమని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతేడాది స్పష్టం చేసింది. ఉద్యోగ సంఘాల నుంచి వరుసగా డిమాండ్లు వస్తుండడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతుండడంతో పెండింగ్ డీఏపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

ఉద్యోగుల డీఏను ఏడాదికి రెండుసార్లు పెంచుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను జనవరిలో ఒకసారి, జూలైలో రెండోసారి పెంచుతుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగులు, పెన్షనర్లు 4 శాతం పెరుగుదలతో డీఏ ప్రయోజనం పొందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచగా.. ఆ తర్వాత కరువు భత్యం 38 శాతానికి పెరిగింది. వచ్చే ఏడాది జనవరి నెలలో కూడా 4 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. జనవరి తర్వాత ఉద్యోగులకు 42 శాతం చొప్పున డీఏ పొందవచ్చని అనుకుంటున్నారు.

Also Read: Contempt of Court: పెరుగుతున్న కోర్టు ధిక్కరణ కేసులు, దేనికి సంకేతమో తెలిస్తే ఆందోళన

Also Read: Idem Karma: ఇదేం కర్మపై వ్యతిరేకత, తెలుగు తమ్ముళ్లకు నచ్చని రాబిన్ శర్మ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News