India Playing XI vs Bangladesh 2nd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మొదటి వన్డేలో ఓడిన భారత్ రెండో వన్డేలో బంగ్లాతో అమీతుమీ తేల్చుకోనుంది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచులో రోహిత్ సేన తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు చివరి రెండు వన్డేలను గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని బంగ్లాదేశ్ చూస్తోంది. రెండో వన్డే నేపథ్యంలో భారత్ తుది జట్టును ఓసారి పరిశీలిద్దాం.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఆడటం ఖాయం. మొదటి వన్డేలో విఫలమయిన ఈ ఇద్దరూ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించాల్సి ఉంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫస్ట్‌డౌన్‌లో బరిలోకి దిగుతాడు. తొలి మ్యాచులో స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగిన కోహ్లీ చెలరేగాల్సి ఉంది. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనున్నారు. తొలి వన్డేలో రాణించిన రాహుల్.. ఆ ఫామ్ కొనసాగించాల్సిన అవసరం ఎంతో ఉంది. అయ్యర్ మరిన్ని పరుగులు చేస్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఆరో స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆడనున్నాడు. ఏడో స్థానంలో షెహ్‌బాజ్ అహ్మద్ ఆడనున్నాడు. వచ్చిన అవకాశాన్ని షెహ్‌బాజ్ వినియోగించుకోలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమయ్యాడు. ఫిట్‌నెస్ సమస్యలతో తొలి వన్డేకు దూరమైన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. కోలుకుంటే షెహ్‌బాజ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. దీపక్ చహర్, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. యువ పేసర్ కుల్దీప్ సేన్ మరో మ్యాచ్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గాయపడిన శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ శార్దూల్ ఫిట్‌గా ఉంటే.. ఉమ్రాన్ జట్టులోకి రావాలంటే కుల్దీప్ బెంచ్‌కే పరిమితం అవుతాడు.
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), షెహ్‌బాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్/ఉమ్రాన్ మాలిక్, దీపక్ చహర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్.
Also Read: Crime News: ప్రేమను నిరాకరించిందని.. యువతి గొంతుకోసి చంపేసిన ప్రేమోన్మాది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.