Health Insurance For Parents: జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ముఖ్యంగా కరోనా తరువాత ప్రపంచం మొత్తం ఒక్కసారిగా తలకిందులైనట్లు అయింది. కోవిడ్ ప్రభావంతో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే.. ముందు జాగ్రత్తగా హెల్తె ఇన్సూరెన్స్‌లు కూడా చేయిస్తున్నారు. మరికొంత మంది ఇంకా నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు వైద్య బీమా చేయించడంలో ఏ మాత్రం అలసత్వం వహించకూడదు. తల్లిదండ్రుల కోసం ఉత్తమమైన ఆరోగ్య బీమా పాలసీ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.. ఓ లుక్కేయండి.
హెల్త్ పాలసీ కొనుగోలు చేస్తున్నప్పుడు దాని కవరేజీ ప్రయోజనాలను వివరంగా చదవండి. తద్వారా అనారోగ్యం లేదా ప్రమాదం సమయంలో తల్లిదండ్రుల చికిత్సకు ఎటువంటి సమస్య ఉండదు. పాలసీకి సంబంధించిన అన్ని నిబంధనలు, షరతులను తెలుసుకోండి. ఆసుపత్రిలో చేరడం, చికిత్స తర్వాత చేసే సదుపాయం ఇందులో ఉందో లేదో కూడా తనిఖీ చేయాలి. పాలసీ కాలవ్యవధి ఏమిటో కూడా చూడండి. డే కేర్, తీవ్రమైన వ్యాధుల కవర్ వంటి సౌకర్యాలు ఉన్నాయో లేదో కూడా తెలుసుకోవాలి.
మీరు తల్లిదండ్రుల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీని తీసుకుంటే.. అందుకోసం కోసం ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. అందుకే వారితో పాటు మీ కోసం కూడా పాలసీ తీసుకుంటే బాగుంటుంది. అధిక బీమా మొత్తంతో తల్లిదండ్రులకు వైద్య బీమా అందుబాటులో ఉంది. తల్లిదండ్రులకు వార్షిక ఆరోగ్య పరీక్షలు, నగదు రహిత చికిత్స, ట్రీట్‌మెంట్‌పై ఇతర సౌకర్యాలు లభిస్తాయి. ఈ పథకాల్లో కరోనాను కూడా చేర్చారు. మీరు ఇఫ్కో టోకియో, కోటక్ మహీంద్రా, ఆదిత్య బిర్లా వంటి అనేక కంపెనీల నుంచి ఆరోగ్య బీమా తీసుకోవచ్చు.
తల్లిదండ్రుల కోసం క్యాష్‌లెస్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు.. వారు బాధపడుతున్న వ్యాధులు ఇన్సూరెన్స్‌లో ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. దీంతో పాటు వృద్ధాప్యానికి సంబంధించిన ఎన్ని వ్యాధులు ఆ పాలసీలో ఉన్నాయో కూడా చూడండి. గరిష్ట సంఖ్యలో వ్యాధులను కవర్ చేసే పాలసీ మంచిదని భావిస్తారు. అనేక పాలసీలలో దీర్ఘకాలిక వ్యాధులు లేదా 30 రోజుల ముందు నిర్ధారణ అయిన వ్యాధులు కవర్ చేయవు. అలాంటి పాలసీని తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Cyclone Mandous: తీరం దాటిన మాండూస్ తుఫాన్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు
Also Read: Adibatla Young Woman Kidnap Case: కిడ్నాప్ అయిన యువతి సేఫ్.. వెలుగులోకి సంచలన విషయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Health Insurance: తల్లిదండ్రులకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలను చెక్ చేయండి