Fitment Factor Of 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. త్వరలో ఉద్యోగుల జీతాల్లో పెంపుదల ఉండబోతోంది. ఉద్యోగుల జీతంపై ప్రభుత్వం కీలక తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల జీతంలో ఈ పెంపు ఏకమొత్తంగా ఉండనుందని సమాచారం. ఈసారి కొత్త ఏడాది సందర్భంగా ఉద్యోగులకు భారీ కానుకను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
బడ్జెట్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్
దీంతో పాటు ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను కూడా సవరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా.. త్వరలోనే అప్డేట్ వస్తుందంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు 2.57 ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ లభిస్తుండగా.. దీన్ని 3.68కి పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇదే జరిగితే ఉద్యోగుల కనీస వేతనం నేరుగా రూ.18,000 నుంచి రూ.26 వేలకు పెరుగుతుంది.
లెక్కింపు ఇలా..
మీ బేసిక్ శాలరీ రూ.18 వేలు అయితే.. మిగిలిన అన్ని రకాల అలవెన్సులు మినహాయించి మీరు 2.57 ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌గా రూ.46,260 పొందుతున్నారు. వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం 3.68 పెంచితే బేసిక్ పే రూ.26 వేలపై ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తెక్కిస్తారు.
రూ.26 వేల బేసిక్ శాలరీ ప్రకారం.. ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68గా లెక్కిస్తే, ఉద్యోగులకు ఏక మొత్తంలో రూ.95,680 వస్తుంది. ఉద్యోగుల జీతంలో బంపర్ పెరుగుదల ఉంటుంది. ఈ డబ్బును ఒకేసారి ఖాతాలోకి బదిలీ చేయవచ్చు.
గతంలో కేంద్ర ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచగా.. ఉద్యోగుల జీతం మూడు రెట్లు పెరిగిన విషయం తెలిసిందే. ఉద్యోగుల వేతనాన్ని నేరుగా 6 వేల నుంచి రూ.18 వేలకు పెంచారు. ఈసారి ఉద్యోగుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరిస్తే.. జీతం 18 వేల నుంచి 26 వేలకు పెరగనుంది.
Also Read: Adibatla Young Woman Kidnap Case: కిడ్నాప్ అయిన యువతి సేఫ్.. వెలుగులోకి సంచలన విషయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook