Liger Financier Sobhan Interrogated by ED Officials: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందిన లైగర్ సినిమాని ఇప్పట్లో ఈడీ అధికారులు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్ నిర్మాత చార్మి కౌర్ హీరో విజయ్ దేవరకొండలను వేర్వేరుగా పిలిపించి విచారించిన ఈడీ అధికారులు ఇప్పుడు ఈ సినిమాకి ఫైనాన్షియర్ గా వ్యవహరించిన శోభన్ అనే వ్యక్తిని కూడా విచారించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శోభన్ ఫైనాన్షియర్ గా తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాలకు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాకి కూడా ఆయన ఫైనాన్షియర్ గా వ్యవహరించారు. అయితే లైగర్ సినిమాకు రాజకీయ నాయకుల నుంచి పెట్టుబడులు వచ్చాయని, విదేశీ నిధులు కొన్ని సినిమా నిర్మాతలకు వచ్చాయని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి ఇప్పటికే పలువురిని విచారించింది.
ఇప్పుడు తాజాగా శోభన్ ను కూడా విచారించడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి శోభన్ పేరు పూరి జగన్నాథ్ నోటి వెంట బయటకు వచ్చింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయామని పూరీ జగన్నాథ్ ఇంటి ముందు ధర్నాకు సిద్ధమవుతున్న సమయంలో పూరీ జగన్నాథ్ వారందరిని హెచ్చరిస్తూ విడుదల చేసిన వాయిస్ నోట్లో పూరి జగన్నాథ్ ఈ శోభన్ గురించి ప్రస్తావించారు.
ఇక ఈరోజు శోభన్ ను ఈడీ అధికారులు విచారించారని తెలుస్తోంది. విదేశీ కంపెనీల నుంచి ఏమైనా సినిమాకు పెట్టుబడులుగా వచ్చాయా? లేదా? అనే విషయాల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ లైగర్ సినిమాకి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పెట్టుబడులు పెట్టినట్లు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు, సీబీఐ అధికారులకు లేఖలు రాశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ విషయం మీద దృష్టి సారించి పలు దఫాలుగా విచారణ అయితే జరుపుతున్నారు. మరి ఈ కేసులో వారు ఎలాంటి పురోగతి సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది.
Also Read : Shah Rukh Khan: అమితాబ్ కాళ్లపై పడ్డ షారుఖ్.. జయపై ట్రోలింగ్.. అసలు ఏమైందంటే?
Also Read : Varisu - Mahesh babu: మహేష్ బాబు వద్దన్న కధే వారిసు.. రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్ లను టచ్ చేస్తూ విజయ్ వద్దకు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook