Payal Ghosh Tweets on NTR పాయల్ ఘోష్ రెండేళ్ల క్రితం ఎన్టీఆర్ అభిమానులకు ఫేవరేట్‌గా మారింది. మీరా చోప్రా ఎన్టీఆర్ గురించి పిచ్చి వాగుడు వాగడం, అతను ఎవరు? అని ప్రశ్నించడం లాంటిది చేసింది. ఆ తరువాత యంగ్ టైగర్ ఫ్యాన్స్ మీరా చోప్రాను ఆడేసుకున్నారు. ఇక ట్రోలింగ్ భరించలేక మీరా చోప్రా సైబర్ పోలీసులను కూడా ఆశ్రయించింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను సపోర్ట్ చేస్తూ యంగ్ టైగర్ గురించి ఎంతో గొప్పగా ట్వీట్లూ వేస్తూ వచ్చింది పాయల్ ఘోష్. తాను ఊసరవెల్లి సినిమాలో కలిసి పని చేశాను అని, ఎన్టీఆర్ చాలా గొప్ప వాడు అవుతాడంటూ, ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంటాడని అప్పుడే చెప్పేసింది పాయల్.
This is just so refreshing. Naatu fever hits Oscars as well as it becomes the first Indian song to be shortlisted for it. Overwhelmed. This is pure #Rajamouli Sir" magic.!! Congratulations #teamRRR @tarak9999
— Payal Ghoshॐ (@iampayalghosh) December 23, 2022
ఇప్పుడు అదే విషయాన్ని పాయల్ గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డుల కోసం షార్ట్ లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఇలా ఓ ఇండియన్ సాంగ్ సెలెక్ట్ అవ్వడం ఇదే మొదటి సారి. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి వేసిన స్టెప్పులు గ్లోబల్ వైడ్‌గా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు ఎన్టీఆర్ గురించి పాయల్ వేసిన ట్వీట్లు చెర్రీ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసేలా ఉన్నాయి.
When I was supporting @tarak9999 in 2020 and challenged everyone that very soon he’s going to be the global face… all were laughing at me….. Now see… I never go wrong #rrrfever #oscar
— Payal Ghoshॐ (@iampayalghosh) December 23, 2022
2020లోనే ఎన్టీఆర్ గురించి చెప్పాను.. ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాడు అని చెప్పా.. కానీ అప్పుడు అంతా నవ్వారు..ఇప్పుడు ఆస్కార్ బరిలో ఉన్నాడు.. నాటు నాటు సాంగ్ ఊపేస్తోంది.. అంతా నాటు నాటు ఫీవర్.. ఆస్కార్ ఫీవర్ అంటూ ఇలా చెప్పుకొచ్చింది. అయితే దీనిపై రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఒక్క ఎన్టీఆరే కాదు.. ఆ పాటలో రామ్ చరణ్ కూడా ఉన్నాడు.. అది కనిపించడం లేదా? అంటూ ఆయన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Pawan Kalyan Nandamuri Balakrishna : వీర సింహారెడ్డి సెట్లో పవన్ కళ్యాణ్.. బాలయ్యతో పవర్ స్టార్ ముచ్చట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook