RRR Premiere At Chinese Theatre ప్రస్తుతం రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ప్రకటించిన బెస్ట్ డైరెక్టర్ అవార్డును అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఇండియన్ మొదటి డైరెక్టర్‌గా రాజమౌళి రికార్డులు క్రియేట్ చేశాడు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు ప్రకటించిందంటే.. దాదాపుగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చినట్టే అని అంతా అంటుంటారు. ఇక ఆస్కార్ అవార్డును అందుకునేందుకు రాజమౌళి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాడు.
అయితే ఇప్పుడు అతి పెద్ద స్క్రీన్‌లు ఉన్న థియేటర్లుగా లాస్ ఏంజిల్స్‌లోని ఐమాక్స్, చైనీస్ థియేటర్లు రికార్డ్‌లు క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాను అక్కడ ప్రీమియర్‌గా ప్రదర్శించారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన వంద సెకన్లలోనే ఉన్న టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. 98 సెకన్లలో 932 టికెట్లు అమ్ముడుపోయాయట.
అలా ఆర్ఆర్ఆర్ క్రేజ్ మరోసారి అందరికీ అర్థమైంది. ఇలా ఇంత వరకు ఏ ఇండియన్ సినిమా విషయంలోనూ జరగలేదని తెలుస్తోంది. ఈ మేరకు బియాండ్ ఫెస్ట్ అనే అంతర్జాతీయ సంస్థ ఇలా ట్వీట్ వేసింది. ఇది ఒక చరిత్ర.. చైనిస్ థియేటర్, ఐమాక్స్‌లో 98 సెకన్లలో టికెట్లన్నీ బుక్ అయిపోయాయ్.. ఇంత వరకు ఓ ఇండియన్ సినిమా విషయంలో ఇలా జరగలేదు.. ఎందుకంటే ఇంత వరకు ఆర్ఆర్ఆర్ వంటి సినిమా రాలేదు..అంటూ పొగిడేసింది.
98 seconds… 932 Tickets… SOLD OUT!! #RRRMovie
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥 https://t.co/MpoYbPFH4K
— RRR Movie (@RRRMovie) January 5, 2023
ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇక గోల్డెన్ గ్లోబ్ రేసులోనూ ఆర్ఆర్ఆర్ నిలిచింది. నాటు నాటు అంటూ కీరవాణి కొట్టిన ఈ పాటకు బెస్ట్ సాంగ్ అవార్డు వచ్చే అవకాశాలున్నాయి. మరి ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సత్తా చాటుతుందా? లేదా? అన్నది చూడాలి.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్‌ఆర్ రికార్డులు క్రియేట్ చేసింది. అయితే బాహుబలి రికార్డులు మాత్రం ఇంకా పదిలంగానే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ జపాన్‌లో మాత్రం ముత్తు సినిమా రికార్డులను బద్దలు కొట్టేసింది. ఆర్ఆర్ఆర్ మాయలో జపాన్ ఆడియెన్స్ మునిగిపోయారు. ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఆర్ఆర్ఆర్ మేనియా నడుస్తోంది.
Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట
Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి