4 AP Youth Arrested in Ghatkesar Engineering College Morphing Case: హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలంలో విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్న కొంతమంది అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి వారికి పంపించి వేధిస్తున్న ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం మీద విద్యార్థినులు అందరూ కాలేజీ బయట ఆందోళన కూడా నిర్వహించడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు రంగ ప్రవేశం చేసి కాలేజీలో దర్యాప్తు చేస్తున్న సమయంలో కూడా విద్యార్థినుల ఫోన్లకు అసభ్యకరమైన ఫోటోలు రావడంతో ఈ విషయాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అలా దర్యాప్తు జరిపి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు యువకులను కూడా అరెస్టు చేశారు. అయితే ఇక్కడే ఒక కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అదేమంటే సదరు విద్యార్థినుల ఫోన్ నెంబర్లన్నీ కాలేజీలోనే చదువుతున్న మరో విద్యార్థిని ఇచ్చినట్లు తేలింది. పోలీసుల దర్యాప్తులో తేలిన పూర్తి వివరాలు శనివారం నాడు మీడియాకు వెల్లడించారు.
అసలు విషయం ఏమిటంటే గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మీ గణేష్, ప్రవీణ్ అనే ఇద్దరు స్నేహితులు ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో జులాయిగా తిరుగుతున్నారు. వీరిద్దరికి విజయవాడ బస్టాండ్ దగ్గరలో ఒక హోటల్ లో పనిచేసే సతీష్, డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తులు పరిచయమయ్యారు. వారిలో లక్ష్మీ గణేష్ ఇంస్టాగ్రామ్ లో అమ్మాయిల అకౌంట్లు వెతికి వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి వారితో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకునేవాడు. వారిని మాయమాటలతో బుట్టలో పడేసి ఫోన్ నెంబర్లు తీసుకుని ఆ నెంబర్లు తన స్నేహితులు ప్రవీణ్, దుర్గాప్రసాద్ లకు చేరవేసేవాడు.
అలా అతను ఘట్కేసర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థినితో పరిచయం పెంచుకొని ఆమె దగ్గర నుంచి మరికొందరు విద్యార్థినుల ఫోన్ నెంబర్లు అడిగి తీసుకున్నాడు. ఫోన్ నెంబర్లే కదా ఇస్తే ఏమవుతుంది? అనుకుని అతనికి నెంబర్లు చేరవేసిన సదరు విద్యార్థినికి లక్ష్మీ గణేష్ షాక్ ఇచ్చాడు. ఆమె దగ్గర తీసుకున్న ఆ నెంబర్లను ప్రవీణ్, సతీష్, దుర్గాప్రసాద్ లకు చేరవేయడంతో వారంతా యువతుల నెంబర్లతో నాలుగు వాట్స్ ఆప్ గ్రూపులు ఏర్పాటు చేశారు.
వారు వాట్సాప్ లో డీపీలుగా పెట్టుకున్న ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆ గ్రూపులలో పోస్ట్ చేస్తూ వచ్చేవారు తమతో మాట్లాడాలని, చెప్పిన ప్రదేశానికి రావాలని కొన్ని లొకేషన్లు షేర్ చేస్తూ, రాలేమని చెబితే అసభ్య పదజాలాన్ని వాడుతూ తాము చెప్పింది చేయకుంటే మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగేవారు.
కాలేజీలో చదువుకునే విద్యార్థినులు ఎందుకు వచ్చింది అని ఈ నెంబర్లను బ్లాక్ చేస్తే, మరికొన్ని కొత్త నెంబర్ల నుంచి వాట్సాప్ గ్రూపులు మళ్ళీ క్రియేట్ చేసి వేధింపులు మొదలుపెట్టేవారు. దీంతో విసుగెత్తి వారు కాలేజీ ముందు ఆందోళనకు దిగడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు. ఈ వ్యవహారం మీద పోలీసులు దృష్టి పెట్టి సాంకేతిక పరిజ్ఞానంతో ఏపీకి చెందిన ఈ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి మీద ఐటీ చట్టాలతో పాటు మహిళా వేధింపుల చట్టాలు కూడా నమోదు చేసే అంశం పరిశీలిస్తున్నామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.
Also Read: Shock to Waltair Veerayya: మరో సారి వాల్తేరు వీరయ్య యూనిట్ కు షాక్.. ఈసారి ఏమైందంటే?
Also Read: Kanjhawala Case: ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో డ్రగ్స్ కోణం.. తెలంగాణ నుంచి తీసుకెళ్లారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook