High BP in Winter: చలికాలంలో హై బిపి ప్రాణాంతకమా ? బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా ?

High BP in Winter Season ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హ్యామరేజ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరగడం వెనుకున్న కారణాలను విశ్లేషిస్తూ న్యూరాలజిస్ట్స్ ఓ భయంకరమైన విషయాన్ని వెల్లడించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2023, 04:50 PM IST
  • చలికాలంలో పెరుగుతున్న బ్లడ్ ప్రెషర్
  • చలికాలంలోనే బిపి ఎందుకు పెరుగుతుంది ? కారణం ఏంటో తెలుసా ?
  • చలికాలంలో బిపి ఎక్కువైతే ఏమవుతుందో తెలుసా ?
High BP in Winter: చలికాలంలో హై బిపి ప్రాణాంతకమా ? బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా ?

High BP in Winter Season : చాలా మందికి బిపి సమస్య చాలా కామన్‌గా కనిపిస్తుంది. బీపీతో ఏం కాదులే అని లైట్ తీసుకుంటుంటారు. కానీ తాజాగా న్యూరాలజిస్టులు చెప్పే విషయం వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే చలి కాలంలో హై బిపీ సమస్య ప్రాణాంతకమా అంటే అవుననే అంటున్నారు న్యూరాలజిస్టులు. చలి కాలంలో బిపి కంట్రోల్లో లేకుంటే సమస్యే అవుతుందంటున్నారు న్యూరాలజిస్ట్స్. ఎందుకంటే చలి కాలంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్టయితే.. వారు బ్రెయిన్ స్ట్రోక్‌కి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు. 

బ్లడ్ ప్రెషర్‌తో బాధపడే వారికి న్యూరాలజిస్ట్స్ ఇచ్చే సలహా ఏంటంటే.. ఎప్పటికప్పుడు డాక్టర్స్ కన్సల్టేషన్ తీసుకుని బీపిని కంట్రోల్‌లో ఉంచుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేయాలని చెబుతున్నారు. లేదంటే.. హై బీపీ కాస్తా బ్రెయిన్ స్ట్రోక్ కి దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హ్యామరేజ్ కేసులు భారీగా పెరుగుతుండటంపై దేశ రాజధాని ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్‌లోని న్యూరాలజీ విభాగం సీనియర్ వైద్యుడు అగర్వాల్ స్పందిస్తూ.. సాధారణంగానే చలికాలంలో బిపీ పెరగడం జరుగుతుందని.. బిపీని అదుపులో ఉండేలా చూసుకోకపోతే.. అది కొన్ని సందర్భాల్లో ఇలా బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హ్యామరేజ్ గా మారడం జరుగుతుందని అన్నారు. చలి కాలంలో చమటలు పట్టకపోవడం వల్ల శరీరంలో ఉన్న సోడియం బయటికి పోకపోవడంతో సోడియం లెవెల్స్ పెరిగి అది హై బీపికి దారి తీస్తుందని వివరిస్తున్నారు. చలి కాలం కావడం, ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో బిపీతో బాధపడే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

హై బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడే వారు మాత్రమే కాకుండా.. కొండ ప్రాంతాలకి వెళ్లే వారు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని న్యూరాలజిస్ట్ హెచ్చరిస్తున్నారు. ఎత్తుకు వెళ్లే కొద్దీ ఆక్సీజన్ లెవెల్స్ తగ్గుతుంటాయని.. అది కూడా బ్రెయిన్ స్ట్రోక్ కి దారి తీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : Constipation Home Remedies: చలి కాలంలో వచ్చే మలబద్ధకం సమస్యకు ఇలా 10 నిమిషాల్లో చెక్‌ పెట్టొచ్చు!

ఇది కూడా చదవండి : Kidney stones: కిడ్నీలో రాళ్లుంటే ఈ ఐదు రకాల పండ్లు పొరపాటున కూడా తీసుకోకూడదు

ఇది కూడా చదవండి : Diet For Diabetes: ఎలాంటి ఖర్చులేకుండా మధుమేహానికి ఇలా చలి కాలంలో 10 రోజుల్లో గుడ్‌బై చెప్పండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News