How To Dye Hair Naturally Black: ఈ రోజుల్లో జుట్టు నెరిసిపోవడం సర్వసాధారణం. చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యలతో బాధడుతున్నారు. మరికొందరైతే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి పలు రసాయనాలతో కూడిన రంగులు కూడా వేసుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెల్ల జుట్టు సహజంగా నల్ల రంగులోకి మారడానికి నేచురల్ హెయిర్ డైని వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి నేచురల్ హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
సహజ రంగును తయారు చేయడానికి ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి:
తెల్ల జుట్టుకు సహజ రంగును వినియోగించడానికి ఇలా రంగును తయారు చేసుకోండి. ముందుగా ఉసిరి పొడి, షికాకాయ్ పొడులను తీసుకుని వేడి నీటిలో వాటిని వేసి బాగా మరిగించాల్సి ఉంటుంది. ఆ నీరంతా మిశ్రమంలా తయారు అయ్యేదాకా మరిగించాల్సి ఉంటుంది. ఇలా మరిగించిన మిశ్రమాన్ని బాగా కలపాల్సి ఉంటుంది. అయితే దీనిని జుట్టుకు ప్రతి రోజూ అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
ఉసిరి, షికాకాయ్‌తో హెయిర్ డై:
వేడి నీటిలో వేసి మరిగించిన మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జుట్టు రాలడం, జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.
జుట్టుకు అప్లై చేసే ముందు ఇలా శుభ్రం చేసుకోండి:
ఈ నేచురల్ హెయిర్ డై వేసుకునే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. అయితే దీనిని వినియోగించడానికి ముందుగా జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అలాగే 15 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత రాత్రిపూట జుట్టుకు నూనెతో మసాజ్ చేసి.. తల స్నానం చేయాల్సి ఉంటుంది.
ఎన్ని సార్లు వినియోగించాలో తెలుసా?:
జుట్టు తరచుగా తెల్లగా మారితే ప్రతి వారం రోజుల ఒక సారి మాత్రమే జుట్టుకు ఇలా మిశ్రమాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. చిన్న వయస్సులో జుట్టులో మార్పులు వస్తే తప్పకుండా ఈ మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది. దీనిని ప్రతి వారం జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.
Also Read: Shirdi Bus Accident: షిరిడీ యాత్రకు వెళుతూ తిరిగిరాని లోకాలకు.. రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి