IND Vs NZ 2nd Odi Highlights: టీమిండియా అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఈ ఏడాది వరుసగా ఐదో వన్డే విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో కివీస్‌పై 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కేవలం 108 పరుగులకే కుప్పకూలగా.. అనంతరం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది టీమిండియా. బౌలింగ్‌లో షమీ మూడు వికెట్లు తీసి ఆకట్టుకోగా.. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (51) అర్ధ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. శుభ్‌మన్ గిల్ (40) నాటౌట్‌గా నిలిచాడు. షమీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకంది. కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ పనికి కోట్లాది మంది అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో మూడో బంతిని బౌండరీకి తరలించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. తరువాతి సిక్సర్ బాదాడు. ఐదో బంతిని ఆడేందుకు సిద్ధమవుతుండగా.. అకస్మాత్తుగా హిట్‌మాన్ వీరాభిమాని అయిన ఓ బాలుడు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి.. మైదానంలోకి దూసుకువచ్చాడు. తన అభిమాన ఆటగాడు రోహిత్ శర్మను కౌగిలించుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అకస్మాత్తుగా తన దగ్గరకు వచ్చిన బాలుడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతలో భద్రతా సిబ్బంది వచ్చి బాలుడిని రోహిత్ శర్మ నుంచి దూరం చేశారు.
Moment of the day 😍♥️#RohitSharma || @ImRo45 pic.twitter.com/osrd1n3GMZ
— ᴊᴀɢᴅɪꜱʜ ɢᴀᴜʀ🇮🇳 (Fan Account) (@jagdish_ro45) January 21, 2023
'ఆ బాలుడిని ఏం అనవద్దు. ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. చిన్న పిల్లవాడు..' అని హిట్‌మ్యాన్ భద్రతా సిబ్బందికి సూచించారు. దీంతో రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా కెప్టెన్ మంచితనాన్ని మెచ్చుకుంటున్నారు. బాలుడు హగ్ చేసుకున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్‌లో కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Rohit is an emotion for all of us fans💙💙#RohitSharma pic.twitter.com/aGgPBlIQ3K
— Ankit Sharma (@AnkitSharma8878) January 21, 2023
ఈ సిరీస్ విజయంతో స్వదేశంలో భారత్ వరుసగా ఏడో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. గత నాలుగేళ్లుగా స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఒక్కటి కూడా కోల్పోలేదు. స్వదేశంలో చివరిసారిగా ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. 2018-19 సంవత్సరంలో భారత గడ్డపై కంగారూ జట్టు 3-2తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Also Read: TSRTC: టీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం.. సంక్రాంతికి బస్సులకు మంచి ఆదరణ
Also Read: Wipro Lays Off: విప్రో ఉద్యోగులకు ఝలక్.. 400 మందికి ఉద్వాసన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook