Reasons For Rejecting Loans: జీతం భారీగానే వస్తోంది కనుక తిరిగి రీపే చేయొచ్చులే అనే ఉద్దేశంతో మీరు లోన్ కోసం అప్లై చేసి ఉంటారు. ఇంకొంతమంది అయితే, జీతం భారీగానే వస్తోంది కనుక శాలరీ పే స్లిప్ పెడితే చాలు లోన్ వచ్చేస్తుంది లే అనే ధీమాలో ఉంటారు. కానీ ఉన్నట్టుండి లోన్ రిజెక్టెడ్ అని మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న బ్యాంక్ నుంచి మీ మొబైల్‌కి మెసేజ్ వచ్చే వరకు తెలిసే ఛాన్స్ ఉండదు. లోన్ రిజెక్ట్ అయ్యాకా మళ్లీ ఇంకొంత కాలం ఆగి మీ క్రెడిట్ స్కోర్ మెరుగయ్యాకే తిరిగి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు వేచిచూడక తప్పదు. 

మరి సాధారణంగా బ్యాంక్ లోన్ రిజెక్ట్ అవడానికి కారణం ఏంటి ? ఎలాంటి పరిస్థితుల్లో మీ బ్యాంక్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ? కేవలం క్రెడిట్ స్కోర్ మాత్రమే కాకుండా ఇంకా ఏయే అంశాలు మీ బ్యాంక్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవడానికి కారణం అవుతాయి అనే విషయాలను ఇప్పుడు బ్రీఫ్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  

ఉద్యోగం:
జీతం ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ.. మీ ఉద్యోగం ఎంత స్థిరమైనది అనే అంశం కూడా బ్యాంకులకు ముఖ్యమే. బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ముందు ముఖ్యంగా గమనించే అంశం ఏంటంటే.. మీరు తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే కెపాసిటీ, ఆదాయ వనరులు మీకు ఉన్నాయా లేదా అనే విషయం. స్థిరమైన ఆదాయ వనరులు ఉన్నప్పుడే కస్టమర్ తీసుకున్న రుణం తిరిగి చెల్లించడం సాధ్యమవుతుంది. అందుకే  బ్యాంకులు మీ ఉద్యోగాన్ని చాలా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తాయి. తరచుగా ఉద్యోగాలు మారే వారికి లేదా ఎక్కువ కాలం పాటు నిరుద్యోగులుగా ఉన్నవారికి బ్యాంకులు అంత ఈజీగా లోన్ ఇవ్వవు. మీ ఉద్యోగం మార్పు, నిరుద్యోగం అంశం బ్యాంకులకు ఎలా తెలుస్తుంది అని అనుకోకండి... ఎందుకంటే మీ ప్యాన్ కార్డ్ మీ క్రెడిట్ హిస్టరీని చెబితే మీరు ఇచ్చే మీ బ్యాంక్ స్టేట్మెంట్ మీ క్రెడిట్, డెబిట్ హిస్టరీని చెబుతుంది. 

అసంపూర్తి వివరాలు:
లోన్ కోసం అప్లై చేసిన వ్యక్తి ప్రస్తుత నివాసం చిరునామా, శాశ్వత నివాసం చిరునామా, ఫోన్ నంబర్, మీ పేరిట, మీ ఫోటోతో పాటు అడ్రస్ ధృవీకరించే కీలకమైన డాక్యుమెంట్స్ ఎంతో అవసరం. ఇలాంటి డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోతే రుణంలో పొందడంలో ఇబ్బందులు తప్పవు. అలాగే ఒకవేళ మీరు హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టయితే.. మీరు కొనుగోలు చేసే ఆస్తికి చట్టబద్ధత లేకున్నా... లేదా ఏవైనా న్యాయపరమైన చిక్కులు ఉన్నా రుణం జారీ చేయడానికి బ్యాంకులు నిరాకరిస్తాయి. ఫలితంగా మీ లోన్ రిజెక్ట్ అవుతుంది. 

పెండింగ్ లోన్లు:
ఒక వ్యక్తి ఏదైనా బ్యాంకుల నుండి రుణం తీసుకుని ఆ రుణాన్ని చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్నట్టయితే.. వారికి ప్రస్తుతం ఎంత ఎక్కువ వేతనం వచ్చినప్పటికీ.. బ్యాంకులు వారికి రుణం ఇవ్వడానికి ఆసక్తి చూపించవు. అందుకు కారణం బ్యాంకులకు సదరు కస్టమర్‌పై నమ్మకం కోల్పోవడమే. అందుకే ఏదైనా కొత్త లోన్‌కి వెళ్లడానికి ముందు మీ పాత లోన్లు కానీ లేదా ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న లోన్స్ కానీ ఏవైనా పెండింగ్‌లో ఉన్నాయా అని సరిచూసుకోవాల్సి ఉంటుంది. 

క్రెడిట్ స్కోర్:
కస్టమర్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు, ఏ బ్యాంకు అయినా మొదట చెక్ చేసేది మీ క్రెడిట్ స్కోర్ ఎంత వర్తీగా ఉందనేదే. గతంలో తీసుకున్న రుణాలను సదరు కస్టమర్ సకాలంలో చెల్లించారా లేదా ? లేదంటే ఎన్ని చెక్ బౌన్సులు ఉన్నాయి ? ఎన్ని లేట్ పేమెంట్స్ ఉన్నాయనేదే మీ క్రెడిట్ స్కోర్ సూచిస్తుంది. క్రెడిట్ స్కోర్ బలహీనంగా ఉంటే.. అంటే 600 పాయింట్స్ లేదా అంతకంటే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నట్టయితే.. మీకు రుణం ఇవ్వడానికి బ్యాంకులు వెనుకడుగేస్తాయి. 700 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నట్టయితే.. దానిని హెల్తీ సిబిల్ స్కోర్‌గా పరిగణిస్తారు. అలాంటి వారికి లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపిస్తాయి.

English Title: 
reasons behind banks rejecting your loans, things to check before applying for loans
News Source: 
Home Title: 

Reasons For Rejecting Loans: శాలరీ భారీగా ఉన్నా లోన్ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసా ?

Reasons For Rejecting Loans: శాలరీ భారీగా ఉన్నప్పటికీ.. బ్యాంకు లోన్ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసా
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Reasons For Rejecting Loans: శాలరీ భారీగా ఉన్నా లోన్ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసా ?
Pavan
Publish Later: 
No
Publish At: 
Monday, January 23, 2023 - 21:50
Created By: 
Pavan Reddy Naini
Updated By: 
Pavan Reddy Naini
Published By: 
Pavan Reddy Naini
Request Count: 
60
Is Breaking News: 
No

Trending News