కిస్మిస్లో పోషక పదార్ధాలు పెద్దమొత్తంలో ఉంటాయి. పాయసం, హల్వా వంటి పదార్ధాల్లో రుచి కోసం తప్పనిసరి ఇవి. కిస్మిస్తో ఆరోగ్యపరమైన లాభాలు చాలా ఉన్నాయి. ప్రత్యేకించి మహిళల ఆరోగ్యం కూడా అత్యంత ఉపయుక్తం. ఇందులో ఉండే న్యూట్రియంట్లు వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
పీరియడ్స్‌లో లాభదాయకం
కిస్మిస్ తినడం పీరియడ్స్ సమయంలో మహిళలకు చాలా మంచిది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. పీరియడ్స్ సమయంలో నానబెట్టిన కిస్మిస్ను బాదం లేదా కేసర్‌తో కలిపి తింటే చాలా మంచిది. మంచి ఫలితాలుంటాయి.
రక్తహీనతకు చెక్
మహిళల్లో రక్త హీనత, ఎనీమియా వంటి వ్యాధుల్ని దూరం చేయడంలో కిస్మిస్ కీలకంగా ఉపయోగపడుతుంది. కిస్మిస్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రక్తం పెరిగేందుకు దోహదపడుతుంది. కిస్మిస్ తినడం వల్ల ఎనీమియా వంటి వ్యాధుల ముప్పు తొలగుతుంది.
నడుము నొప్పి నుంచి ఉపశమనం
కిస్మిస్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల్ని పటిష్టం చేయడంలో సహాయపడుతుంది. సాధారణంగా మహిళలకు నడుము నొప్పి, వీపు నొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కిస్మిస్ తినడం వల్ల ఈ సమస్య దూరం చేయవచ్చు.
ఇమ్యూనిటీ పెరగడం
కిస్మిస్లో ఉండే పోషకాలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడతాయి. కిస్మిస్ తినడం వల్ల అంటువ్యాధుల ముప్పు తగ్గుతుంది. మహిళలు వ్యాధుల్నించి కాపాడుకునేందుకు ఫ్రై చేసిన కిస్మిస్ తినడం మంచిది.
జీర్ణక్రియ మెరుగుదల
కిస్మిస్ జీర్ణక్రియకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ ఇందుకు దోహదపడుతుంది. నానబెట్టిన కిస్మిస్ తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యల ముప్పు తగ్గుతుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు దూరమౌతాయి. జీర్ణక్రియను పటిష్టం చేస్తాయి.
Also read: Piles Causes: జీర్ణక్రియకు అత్యంత ప్రమాదకరం, పైల్స్ సమస్యను పెంచే పదార్ధాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook