India beats New Zealand to enter ICC U-19 Womens T20 World Cup 2023 Final: భారత జట్టు ఐసీసీ అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాలోని సెన్వెస్ పార్క్ మైదానంలో శుక్రవారం (జనవరి 27) న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 14.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. స్వేతా సెహ్రావత్ (61 నాటౌట్), సౌమ్య తివారీ (22) రాణించారు. అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జనవరి 29న జరుగుతుంది.
సెమీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. జార్జియా ప్లిమ్మర్ (35), ఇసాబెల్లా (26) మాత్రమే మోస్తరు స్కోర్ చేశారు. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్స్ పడగొట్టడంతో కివీస్ బ్యాటర్లు కోలుకోలేకపోయారు. భారత బౌలర్లలో ప్రషవి చోప్రా 3 వికెట్లతో చెలరేగారు. టిటాస్ సాధు, మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, అర్చనా దేవి తలో వికెట్ తీశారు.
A dominant performance sends India through to the #U19T20WorldCup final!
📝 Scorecard: https://t.co/nO40lpkR7A
Watch the action live and for FREE on https://t.co/5AuGFN3l1C (in select regions) 📺 pic.twitter.com/0Ik8ET7Zbi
— T20 World Cup (@T20WorldCup) January 27, 2023
108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళలు 14.2 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో శ్వేత సెహ్రావత్ (61; 45 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. సౌమ్య తివారీ (22) కీలక రన్స్ చేశారు. కివీస్ బౌలర్లలో అన్నా బ్రౌనింగ్ రెండు వికెట్లు పడగొట్టారు. ప్రషవి చోప్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నేడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడుతుంది.
Also Read: Honey Rose Hot Pics: శారీలో హనీ రోజ్ ఒంపుసొంపులు.. బ్యాక్ చూస్తే గుండెలు బరువెక్కాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.