Dow jones: అదానీ గ్రూప్‌కు మరో షాక్, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ డోవ్ జోన్స్ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్ తొలగింపు

Dow jones: ఆదానీ గ్రూప్‌పై ఒకదానివెంట మరో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రబావంతో..అదానీ గ్రూప్‌ కోలుకోలేకపోతోంది. అమెరికన్ షేర్ మార్కెట్ డోవ్ జోన్స్.. అదానీ ఎంటర్‌‌ప్రైజెస్‌ను తొలగించేసింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 3, 2023, 03:40 PM IST
Dow jones: అదానీ గ్రూప్‌కు మరో షాక్, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ డోవ్ జోన్స్ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్ తొలగింపు

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రభావంతో అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది. ఓ వైపు షేర్ల పతనం మరోవైపు..షేర్ మార్కెట్ ఆంక్షలు విధిస్తున్నాయి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజ్‌ల నిఘా తరువాత అంతర్జాతీయ మార్కెట్‌‌లో మరో ఊహించని షాక్ తగిలింది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై షేర్ల అవకతవకలు, మనీ లాండరింగ్, అవినీతి ఆరోపణలతో టార్గెట్ చేయడంతో ఆ కంపెనీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 20 నుంచి వైదొలగి..21వ స్థానానికి చేరిపోయారు గౌతమ్ అదానీ. ఆ తరువాత ఇవాళ రెండు భారీ షాక్‌లు తగిలాయి. భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీలైన ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు అదానీ గ్రూప్‌కు చెందిన మూడు కంపెనీలను నిఘాలో ఉంచాయి. ఈ పరిణామం అదానీ గ్రూప్‌కు ఊహించని ఎదురుదెబ్బ.

ఇప్పుడు తాజాగా మరో షాక్ తగిలింది. ప్రముఖ అమెరికన్ షేర్ మార్కెట్ ఎక్స్చేంజ్ ఎస్అండ్‌పి డోవ్ జోన్స్ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను లిస్ట్ నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను డోవ్ జోన్స్ సస్టెయినిబిలిటీ ఇండెక్స్ నుంచి తొలగించినట్టు డోవ్ జోన్ కంపెనీ స్వయంగా ప్రకటించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌పై స్టాక్ విలువలో అవకతవకలు, ఎక్కౌంటింగ్ ఫ్రాడ్ ఆరోపణలున్నాయి. డోవ్ జోన్స్ అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీని తొలగించడం అంతర్జాతీయ మార్కెట్‌లో పెద్ద దెబ్బగా భావించాలి. 

హిండన్‌బర్గ్ నివేదికతో నిర్ణయం

అదానీ గ్రూప్ ఇటీవలే అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీవో రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ తరువాత న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్ ఎఫ్‌పీవో రద్దు అనేది హిండెన్‌బర్గ్ నివేదిక తరువాతే జరిగింది. ఈ నిర్ణయం అనంతరం..అసాధారణ పరిస్థితుల కారణంగా ఎఫ్‌పీవోను ముందుకు కొనసాగించడం అనైతికమని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అభిప్రాయపడ్డారని అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అద్యక్షుడు గౌతమ్ అదానీ తెలిపారు. 

ఇన్వెస్టర్ల ప్రయోజనం తమకు అతి ముఖ్యమని..ఇన్వెస్టర్లను నష్టాల్నించి కాపాడేందుకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఎఫ్‌పీవో రద్దు చేసేందుకు నిర్ణయించారని గౌతమ్ అదానీ తెలిపారు. అటు డోవ్ జోన్స్ నుంచి అదానీ కంపెనీని తొలగించే నిర్ణయం ఫిబ్రవరి 7 నుంచి అమలు కానుంది. గత కొద్దిరోజుల్నించి అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమౌతున్నాయి. నిన్న అంటే గురువారం నాడు ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్ 3442 రూపాయల నుంచి  55 శాతం నష్టంతో 1564 రూపాయలకు పడిపోయింది. ఇవాళ కూడా మరో 25 శాతం నష్టంతో 1174 రూపాయలకు పడిపోయింది.

ఇక దేశీయగా అదానీ గ్రూప్‌పై ఎన్ఎఈ, బీఎస్ఈలు నిఘా విధించాయి. దీని ప్రకారం ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేయకుండా అదానీ గ్రూప్‌పై నియంత్రణ విధించారు. గ్రూప్‌కు చెందిన మూడు కంపెనీల షేర్లపై నిఘా కొనసాగుతోంది. 

Also read: Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం అంతా అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే జరిగిందా, ఈడీ ఛార్జిషీటులో ఏముంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News