Revanth Reddy to KCR: కేసీఆర్‌పై ఘాటైన పదజాలంతో విరుచుకుపడిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams KCR: ప్రగతి భవన్‌ని నక్సలైట్లు పేల్చేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు తప్పుపడుతూ ఎదురుదాడికి దిగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2023, 02:21 AM IST
Revanth Reddy to KCR: కేసీఆర్‌పై ఘాటైన పదజాలంతో విరుచుకుపడిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams KCR: ప్రగతి భవన్ తెలంగాణ ప్రజాధనంతో నిర్మించింది. అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం కనుక అక్కడ తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలకు ప్రవేశం ఉండాలి. గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తమ అధికారిక నివాసంలోనే ప్రజలను కలిశారు. మరి కేసీఆర్ ఎందుకు ప్రగతి భవన్ లోకి ప్రజలకు ఎంట్రీ ఇవ్వడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉంటే ఏంటి ? లేకపోతే ఏంటని నిలదీశారు. అందుకే తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడదామని ప్రజలకు పిలుపునిస్తున్నా అని రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బిఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

ప్రగతి భవన్‌ని నక్సలైట్లు పేల్చేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు తప్పుపడుతూ ఎదురుదాడికి దిగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ప్రగతి భవన్‌ను నేలమట్టం చేసే బాధ్యతను మేమే తీసుకుంటాం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, మంత్రి కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.

అప్పుడు లేని తప్పు ఇప్పుడెందుకొచ్చింది ?
నక్సలైట్ల ఎజెండా నా ఎజెండా ఒక్కటే అని కేసీఆర్ ప్రకటించడాన్ని సమర్దించిన వాళ్లు.. అదే నక్సలైట్లు ప్రగతి భవన్‌ని కూల్చేయాలంటే ఎందుకు తప్పుపడుతున్నారో అర్థం కావడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులకు, తన కుటుంబసభ్యులకు, బంధువులకు మంత్రి పదవులు ఇవ్వాలని నక్సలైట్ల ఎజెండాలో ఉందా ? మరి వారికి మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారని కేసీఆర్ వైఖరిని రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ప్రగతి భవన్ ని నక్సలైట్లు పేల్చేయాలి అనేది తన ఆలోచన మాత్రమే కాదని.. తెలంగాణ ప్రజల ఆలోచననే తాను చెప్పానని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి నిరంకుశ పాలన నుంచి శాశ్వత పరిష్కారం కోసం తుది దశ ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టింది. మేం గాంధీ వారసులం.. హింసకు వ్యతిరేకంగానే మా పోరాటాలు ఉంటాయి. శాంతి స్థాపన కోసమే ఈ యాత్ర చేపడుతున్నాం. తెలంగాణ వచ్చాక ఎన్‌కౌంటర్స్ ఉండవని కేసీఆర్ ప్రకటించాడు. సొంత రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ అధికారంలో ఉండగా జరిగిన ఎన్‌కౌంటర్లకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు అని రేవంత్ రెడ్డి కేసీఆర్‌ని నిలదీశారు. 9నెలల్లో ప్రగతి భవన్ నిర్మించారు. 12 నెలల్లో సచివాలయం నిర్మించారు. కానీ తెలంగాణ వచ్చి 9 ఏళ్లు అవుతున్నా.. స్వరాష్ట్రం కోసం అసువులుబాసిన అమరవీరుల స్థూపం కట్టలేకపోయారు అని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇది కూడా చదవండి : Rs 39,000 Smartphone for Rs 8000: రూ. 39 వేల స్మార్ట్ ఫోన్ జస్ట్ రూ. 8 వేలకే.. బంపర్ ఆఫర్

ఇది కూడా చదవండి : Oneplus 5G Smartphones: వన్‌ప్లస్ నుంచి తక్కువ ధరకే మరో సూపర్ స్మార్ట్‌ఫోన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News