Sukesh legal notice: బాలీవుడ్ నటికి సుకేష్ 100 కోట్ల పరువు నష్టం దావా

Sukesh Chandrasekhar legal notice: మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ ఇప్పుడు ఒక బాలీవుడ్ నటి మీద ఏకంగా 100 కోట్ల పరువు నష్టం దావా వేయడం హాట్ టాపిక్ గా మారింది, ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 11, 2023, 11:49 PM IST
Sukesh legal notice: బాలీవుడ్ నటికి సుకేష్ 100 కోట్ల పరువు నష్టం దావా

Sukesh Chandrasekhar legal notice to Chahat Khanna: బాలీవుడ్ నటి మాటలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలను బుట్టలో పడేసుకుని తన వెంట తిప్పుకుంటూ వారిని కూడా చిక్కుల్లో పడేలా చేసిన మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ ఇప్పుడు ఒక బాలీవుడ్ నటి మీద ఏకంగా 100 కోట్ల పరువు నష్టం దావా వేయడం హాట్ టాపిక్ గా మారింది. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహారు జైల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ చాహత్ కన్నా అనే ఒక బాలీవుడ్ నటి మీద 100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. చాహత్ కన్నా చేసిన తప్పుడు ఆరోపణల కారణంగా తన పరువు పోయిందని అందువల్ల మానసికంగా తీవ్రత క్షోభ అనుభవించానని సుఖేష్ చంద్రశేఖర్ పరువు నష్టం దావాలో పేర్కొన్నారు.

ఈ క్రమంలో సుఖేష్ చంద్రశేఖర్ తన న్యాయవాది ద్వారా చాట్ కన్నాకు లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో ఈ విషయం మీద క్షమాపణలు చెప్పాలని ఆయన నోటీసుల్లో పేర్కొన్నాడు. ఇక ఈ విషయంలో వారం రోజులలో కనుక క్షమాపణలు చెప్పకపోతే లీగల్ నోటీసులు అందుకున్న నేపథ్యంలో లీగల్గా ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అసలు విషయం ఏమిటంటే పలు హిందీ సీరియల్స్ లో నటించి పాపులారిటీ దక్కించుకున్న చాహత్ కన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ జాక్వలిన్ ఫెర్నాండేజ్ తరహా లోనే తనని కూడా మోసం చేయడానికి సుఖేష్ చంద్రశేఖర్ ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. అంతేకాక బలవంతంగా తీహార్ జైలుకు రప్పించి పెళ్లి సైతం చేసుకుంటానని తనకు ప్రపోజ్ చేశాడని ఆమె పేర్కొంది. ఢిల్లీలో ఈవెంట్ ఉందని చెప్పి పింకీ ఇరానీ అనే ఒక మహిళ తనను జైలుకు తీసుకువెళ్లిందని అక్కడ సుఖేష్ చంద్రశేఖర్ తనను కలిశాడని ఆమె పేర్కొంది. అక్కడ సుఖేష్ చంద్రశేఖర్ తాను ఒక సౌత్ ఇండియన్ ఛానల్ కు యజమానిని అని జయలలిత మేనల్లుడిని అని పరిచయం చేసుకున్నారని ఈవీఎం ట్యాంపరింగ్ కేసులో అరెస్టయ్యానని చెప్పాడని పేర్కొంది.

సరే నన్నెందుకు పిలిచావు అని అడిగితే మీరు నటిస్తున్న సీరియల్ లో చూసి మీరు నచ్చి పిలిచాను అని చెబుతూ అదే సమయంలో మోకాళ్ళ మీద కూర్చుని పెళ్లి చేసుకుంటానని కూడా ప్రపోజ్ చేశాడని ఆమె పేర్కొంది/ నాకు ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పెళ్ళాలు ఉన్నారని చెప్పానని వెంటనే అతని మీద కోపంతో అక్కడి నుంచి వచ్చేసాను అని ఆమె పేర్కొంది. అయితే తీహార్ జైల్లోకి వెళ్ళిన వీడియో చూపించి పది లక్షలు డిమాండ్ చేయగా విషయం బయటకు రాకూడదు అని చెప్పి వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చానని పేర్కొంది. అలా చాహత్ కన్నా చేసిన కామెంట్లు పైన ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ పరువు నష్టం దావా వేశాడు.
Also Read: Nandamuri Ramakrishna Accident: నందమూరి రామకృష్ణ కారుకు యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం!

Also Read: Naatu Naatu Step: ఆనంద్ మహీంద్రాతో కలిసి నాటు నాటు స్టెప్పేసిన రామ్ చరణ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News