Upcoming Cars 2023: నాలుగు కొత్త కార్లను తీసుకొస్తున్న మారుతి సుజికీ.. ఎస్‌యూవీ-ఎంపీవీ మార్కెట్‌లో ప్రకంపనలు ఖాయం!

Maruti Suzuki Upcoming Cars 2023: Fronx, Jimny, Brezza CNG and MPV. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ..  సరసమైన ఎస్‌యూవీ కాకుండా సీఎన్‌జీతో కూడిన ఎస్‌యూవీని తీసుకురాబోతోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 20, 2023, 02:26 PM IST
  • నాలుగు కొత్త కార్లను తీసుకొస్తున్న మారుతి
  • ఎస్‌యూవీ-ఎంపీవీ మార్కెట్‌లో ప్రకంపనలు
  • టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా
Upcoming Cars 2023: నాలుగు కొత్త కార్లను తీసుకొస్తున్న మారుతి సుజికీ.. ఎస్‌యూవీ-ఎంపీవీ మార్కెట్‌లో ప్రకంపనలు ఖాయం!

Maruti Suzuki Upcoming Cars 2023: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతీ సుజుకీ' తన పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉంది. మారుతీ కంపెనీ గత సంవత్సరం మారుతి సుజుకి బలెనో, బ్రెజా మరియు ఎక్స్ఎల్ 6లను అప్‌డేట్ చేసింది. కొత్త కారు 'మారుతి గ్రాండ్ విటారా'ను కూడా పరిచయం చేసింది. ఇక మారుతీ కంపెనీ 2023 సంవత్సరంలో కొత్త కార్లను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. కొత్త ఆఫ్‌రోడింగ్ ఎస్‌యూవీ, సరసమైన ఎస్‌యూవీ కాకుండా.. సీఎన్‌జీతో కూడిన ఎస్‌యూవీని కూడా తీసుకురాబోతోంది. మారుతి సుజుకి రాబోయే నాలుగు కార్ల గురించి ఇప్పుడు చూద్దాం.

Maruti Suzuki Fronx:
మారుతి సుజికీ ఫ్రాంక్స్ కొత్త కాంపాక్ట్ క్రాస్ఓ వర్. ఇది బ్రెజా మరియు బలెనో మధ్య రేంజ్ ఉంటుంది. ఇది రెండు ఇంజన్ ఎంపికలను కలిగి ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ K-సిరీస్ టర్బో పెట్రోల్ ఇంజన్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ కారు ఫ్రంట్ డిజైన్ గ్రాండ్ విటారాను పోలి ఉండగా.. మిగితాది బలెనోను పోలి ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకు మద్దతు ఇచ్చే ఫ్లోటింగ్ 9.0-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు కూడా సీఎన్‌జీలో విడుదల కానుంది. సీఎన్‌జీ మోడ్‌లో ఇది 76bhp మరియు 98Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 వేరియంట్‌లలో (సిగ్మా, డెల్టా, డెల్టా +, జీటా మరియు ఆల్ఫా) రానుంది. ఈ కారు ధర ధరలు రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని అంచనా.

Maruti Suzuki Jimny 5 Door:
ఆటో ఎక్స్‌పో 2023లో మారుతి జిమ్నీ 5-డోర్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 103bhp మరియు 134Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ. ఈ కారు 4X4 సిస్టమ్‌తో కూడా వస్తుంది. ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా, హెడ్‌ల్యాంప్ వాషర్లు, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే మరియు 6 ఎయిర్‌ బ్యాగ్‌లు లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ధర రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.

Maruti Brezza CNG:
కాంపాక్ట్ ఎస్‌యూవీ రూపంలో బ్రెజాను సీఎన్‌జీ అవతార్‌లో కంపెనీ తీసుకురాబోతోంది. ఈ కారు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఈ ఇంజన్ సీఎన్‌జీ మోడ్‌లో 87bhp మరియు 121.5Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్రూయిజ్ కంట్రోల్, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, బ్యాక్ పార్కింగ్ కెమెరా మరియు హిల్-హోల్డ్ అసిస్ట్‌లను పొందవచ్చు. ఈ కారు ధర పెట్రోల్ వేరియంట్ కంటే రూ.60,000 నుంచి రూ.70,000 ఎక్కువగా ఉంటుంది.

Maruti Suzuki MPV:
మారుతీ సుజుకీ, టయోటా భాగస్వామ్యంతో మరో కారు రాబోతోంది. మారుతి ఇప్పుడు టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా ఒక ఎంపీవీని విడుదల చేయనుంది. ఈ కారు 7 సీటర్ ఎంపీవీ మారుతి ఎక్స్ఎల్ 6 కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. ఇన్నోవా హైక్రాస్ మాదిరి ఈ కారు  2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది.

Also Read: Tamilisai Soundararajan: కిందపడిపోయిన గవర్నర్ తమిళిసై.. ఇదే బ్రేకింగ్ న్యూస్ అంటూ కామెంట్  

Also Read: Taraka ratna Kids Name : తారకరత్న బిడ్డల పేర్ల వెనుకున్న రహస్యం ఏంటో తెలుసా?.. తాత అంటే అంత ఇష్టం మరి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News